Wrinkles:ముడతలను అద్భుతంగా తగ్గించే ద్రాక్ష… ఎలానో తెలుసా ?
Grapes In telugu :ద్రాక్ష పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఆ విషయం చాలామందికి తెలుసు అయితే సౌందర్య పోషణ లో కూడా ద్రాక్షపండు చాలా బాగా సహాయపడుతుంది. మచ్చలు ముడతలు వంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతాయి.
అయితే ద్రాక్షని మెత్తని పేస్టులా చేసుకోవాలి దానిలో తేనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే అన్ని ముడతలు,మచ్చలు అన్ని తొలగిపోతాయి.
జిడ్డు చర్మ వారికి ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ద్రాక్ష పండ్లను పేస్టుగా చేసి దానిలో నిమ్మరసం పుదీనా రసం కలిపి ముఖానికి పట్టించి పదినిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే జిడ్డు తగ్గిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.