IRCTC: జ్యోతిర్లింగ దర్శనం మరింత సులువు.. తక్కువ ఖర్చులోనే 6 రోజుల టూర్ ప్యాకేజీ…
IRCTC Tour Package: ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే IRCTC స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న రెండు ఆలయాలను దర్శించే అవకాశం కల్పించింది. దీనిలో ఎన్నో ఆఫర్స్ కూడా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వర ఆలయం.. రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటితో పాటు మరి కొన్ని ఆలయాలను సందర్శించవచ్చు.
IRCTC మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ (MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN) పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. కాచిగూడ నుంచి ఈ రైలు మొదలవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
మొదటి రోజు కాచిగూడలో సాయంత్రం 4:40 గంటలకు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ నెం.12707) బయలు దేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ హోటల్ లో విశ్రాంతి తీసుకున్నాక సాంచి స్థూపం,భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్,ట్రైబల్ మ్యూజియం చూసి రాత్రి భోపాల్ లోనే స్టే ఉంటుంది.
మూడో రోజు టిఫెన్ చేశాక ఉజ్జయినికి బయల్దేరుతారు. ఉజ్జయిని లోని ఆలయాలైన శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాల్ని సందర్సించుకున్నాక.. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మహేశ్వర్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడ అహిల్యాదేవి కోట, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓంకారేశ్వర్‌కు బయలుదేరుతారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవాలి. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది.
ఐదో రోజు ఉదయం టిఫిన్ చేశాక ఇందౌర్‌కు బయల్దేరుతారు. అక్కడ లాల్బాగ్ ప్యాలెస్, గణేష్ మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇందౌర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. రాత్రి 8 గంటలకు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ నెం: 19301)లో కాచిగూడకు బయల్దేరుతారు. ఆ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది.
ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.
కంఫర్ట్‌లో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌కి రూ.35,880
ట్విన్ షేరింగ్‌కు రూ.20,180
ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,750 చెల్లించాలి.
5 – 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.11,910, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,020 చెల్లించాలి.
స్టాండర్ట్‌లో సింగిల్ షేరింగ్‌కి రూ.33,390
ట్విన్ షేరింగ్‌కు రూ.17,700
ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,260
ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,420, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,530 చెల్లించాలి.
ఎక్కువ మంది కిలిసి బుక్ చేసుకుంటే ప్యాకేజి ఇంకా తగ్గుతుంది.
ప్రస్తుతం ఈ టూర్ జులై 3వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన ఇతర వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

