Guess the actress:ఈ సూపర్ క్యూట్ చిన్నారి.. ఒకప్పటి టాలీవుడ్ సెన్సెషన్.. గుర్తుపట్టగలరా ?
Telugu actress shobhana : ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన తన నటనతో పాటుగా డాన్స్ లో కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈరోజు శోభన పుట్టినరోజు. ఈమె తెలుగులో భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే నాగార్జున హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత వరుస అవకాశాలతో చాలా బిజీగా గడిపేసింది. తెలుగుతోపాటు తమిళం మలయాళం హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా డాన్స్ మీద ఫోకస్ పెట్టి డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ డాన్స్ స్కూల్ నడుపుతూ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దుతుంది.
1994లో కళార్పణ అనే సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది.
2006లో వచ్చిన మోహన్ బాబు, మంచు విష్ణుల సినిమాలో చివరి సారిగా నటించారు శోభన. ఆ తర్వాత కెమెరాకు దూరంగా ఉండిపోయయారు. మళ్లీ ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాతో సుమారు 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారీ అందాల తార. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమాలో ఆమె నటన అద్భుతం.


