Beauty Tips

Tooth Paste:టూత్ పేస్ట్ ముఖానికి రాస్తున్నారా…ఈ విషయాలు మీకు తెలుసా…?

Tooth Paste For Face:ప్రతి ఒక్కరు ముఖం మీద మొటిమలు,నల్లటి మచ్చలు,ముడతలు లేకుండా అందంగా కాంతివంతంగా తెల్లగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం ఆందంగా తెల్లగా మారుతుంది. కంటి చుట్టూ నల్లటి వలయాలు,నల్లటి మచ్చలు ,మొటిమలు,మొటిమల కారణంగా వచ్చే మచ్చలు అన్ని తొలగిపోతాయి.

ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చిట్కాలను పాటించటం వల్ల ముఖానికి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ చిట్కాలకు ఏమి అవసరం అవుతాయి. ఎలా తయారుచేసుకోవాలి. ముఖానికి ఎలా అప్ప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కాలకు అవసరమైన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. ఈ చిట్కాల కోసం మనం టూత్ పేస్ట్,ఉప్పు,టమోటో,తేనే వంటివి ఉపయోగిస్తున్నాం. అయితే ప్రతి చిట్కాలోను టూత్ పేస్ట్ ఉపయోగిస్తాం.

ఈ చిట్కాల కోసం ఉపయోగించే టూత్ పేస్ట్ తెల్లది అయ్యి ఉండాలి. ఎరుపు,నీలం టూత్ పేస్ట్ లను వాడకూడదు. ఎందుకంటే తెల్లటి టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మన చర్మానికి ఎటువంటి హాని కలగదు. అదే ఎరుపు,నీలం టూత్ పేస్ట్ లలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ చిట్కాల కోసం పేస్ట్ ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా పేస్ట్ లో ఉన్న ఇంగ్రిడియన్స్ ని చూడాలి. తక్కువ ఫ్లోరైడ్ శాతం ఉన్న టూట్ పేస్ట్ ని మాత్రమే ఉపయోగించాలి.

ఈ చిట్కాలకు పేస్ట్ ని వాడే ముందు మీరు తప్పనిసరిగా ఒక పని చేయాలి. కొంచెం టూట్ పేస్ట్ ని చేతి మీద రాసి 5 నిమిషాల పాటు ఆలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పేస్ట్ రాసిన ప్రదేశంలో దురద,మంట,ఎలర్జీలు రాలేదని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ చిట్కాల కోసం టూట్ పేస్ట్ ని ఉపయోగించాలి. ఒకవేళ మీ చర్మం మీద ఏమైనా రాష్ వస్తే ఈ చిట్కాలను పాటించటకపోవటమే మంచిది.

మొటిమల సమస్యకు
ఈ రోజుల్లో అడ,మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం టూట్ పేస్ట్ ఉపయోగించి ఈ మొటిమల సమస్య నుండి ఎలా బయట పడవచ్చో తెలుసుకుందాం. ఈ చిట్కాకు కేవలం తేనే,టూట్ పేస్ట్ అవసరం అవుతాయి.
Pimples,Beauty
ఒక బౌల్ తీసుకోని దానిలో కొంచెం టూట్ పేస్ట్ వేయాలి. ఆ తరవాత తేనే వేసి బాగా కలపాలి. తేనె చర్మ సౌందర్యంలోను చర్మ పోషణలోనూ బాగా సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన మొటిమలను తగ్గించటంలో బాగా సహాయాపడుతుంది. అంతేకాక చర్మానికి నూతన కాంతిని తీసుకువస్తుంది.

పేస్ట్,తేనే మిశ్రమం బాగా కలిసింది. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఒక నిమిషం రబ్ చేసి ఆలా వదిలేయాలి. పది నుంచి 15 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకొనే ముందు మొటిమలపై ఈ మిశ్రమాన్ని రాసి మరుసటి రోజు ఉదయం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
Amazon Best Offers
https://amzn.to/3zgeuGf