Beauty Tips

White Hair Turn Black:తెల్లజుట్టు నల్లగా మారడానికి ఇప్పుడిక హెయిర్ డై అవసరం లేదు..

White Hair Turn Black:చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో మనలో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. తెల్లజుట్టు నల్లగా మారడానికి ఇప్పుడిక హెయిర్ డై అవసరం లేదు.. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి,ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులో అంటే 25 నుంచి 30 ఏళ్ళు వచ్చేసరికి వస్తుంది. దాంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. వాటి కారణంగా జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకొనే ప్యాక్ లను వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉసిరి పొడి, రెండు స్పూన్ల బ్లాక్ టీ, ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ ఇండిగో పొడి, ఒక స్పూన్ brahmi powder, ఒక స్పూన్ త్రిఫల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిస్రమంను ఒక లీటర్ నీటిలో కలిపి బాగా మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.