Beauty Tips

Hair Care Tips:మందారం ఆకుల‌తో ఇలా చేస్తే.. అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్..

Hair Care Tips:మందారం ఆకుల‌తో ఇలా చేస్తే.. అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రదాన సమస్యల్లో జుట్టు రాలే సమస్య ఒకటి. ఈ సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. వాటి వల్ల తాత్కాలికంగా మాత్రమే ఫలితం ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది.

జుట్టు రాలే సమస్య తగ్గటానికి సహజసిద్దమైన పదార్ధాలతో నూనెను తయారుచేసుకొని వాడితే సరిపోతుంది. మిక్సీ జార్ లో పది మందార ఆకులు, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు వేప ఆకులు,ఒక స్పూన్ మెంతులు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ పేస్ట్ ని వేయాలి.ఆ తర్వాత 100 Ml కొబ్బరి నూనె పోసి బాగా కలపాలి.

పొయ్యి మీద ఈ గిన్నెను పెట్టి 5 నుంచి 7 నిమిషాలు మరిగిస్తే ఆకులలో, మెంతులలో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేస్తే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

వేప ఆకులలో విటమిన్ E సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. అలాగే కరివేపాకులో బీటా కెరోటిన్ (Beta carotene) అనే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

మందార ఆకులు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టులోకి లోతుగా చొచ్చుకు పోయి జుట్టుకు పోషణనిస్తుంది. మెంతులు కుదుళ్లలో విపరీతమైన దురద, జుట్టు చివర్లు చిట్లి పోవడం, పొడిబారిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.