Business

IRCTC Tour Package: తక్కువ బడ్జెట్లో రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు అనేక దేవాలయాల సందర్శన..

IRCTC Tour Package: తక్కువ బడ్జెట్లో రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు అనేక దేవాలయాల సందర్శన.. మనలో చాలా మంది చాలా తక్కువ బడ్జెట్లో జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.

IRCTC మధ్య తరగతి ప్రజల కోసం IRCTC Divya Dakshin yatra అనే పేరుతో ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో భాగంగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైనులో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.

ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. IRCTC జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర మొత్తం 9 రోజుల పాటు ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా 8 రాత్రులు, 9 రోజులు పగటి పూట జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక టూర్ 4 ఆగస్టు 2024 నుంచి ప్రారంభమవుతున్నట్లు IRCTC ప్రకటించింది.

ఈ టూర్ ప్యాకేజీలో రెండు జ్యోతిర్లింగాలతో పాటు కన్యాకుమారి, తంజావురు, త్రివేండ్రం, మధురై, అరుణాచలం, రామేశ్వరం వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు రెండు జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు.

ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఎకానమీ క్లాస్(స్లీపర్) బుక్ చేసుకుంటారో వారికి 9 రోజులకు గాను రూ.14,250 చెల్లించాలి. అయితే ఈ పర్యటన కోసం వీలైనంత త్వరగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టాండర్డ్(థర్డ్ ఏసీ) కేటగీరి కావాలంటే రూ.21,900, కంఫర్ట్‌(2AC) కావాలంటే రూ.28,450 వరకు చెల్లించాలి. 5-11 ఏళ్ల చిన్నారులకు ఎకానమీ కోసం రూ.13,250, స్టాండర్డ్ కోటాలో రూ.20,700, కంఫర్ట్ ప్యాకేజీలో అయితే రూ.27,010 వరకు చెల్లించాలి.

ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ కావాలనుకునే వారు https://www.irctctourism.com/tourpackageBooking ఈ లింక్‌పై క్లిక్ చేసి నేరుగా మీరే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా ఈ ఫోన్ నెంబర్లను 92814495845 లేదా 92814495843 లేదా 040-27702407 నెంబర్లను సంప్రదించగలరు.