White Hair Turn Black:రంగు వేయాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా..
White Hair Turn Black:రంగు వేయాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెల్లజుట్టు సమస్య కనపడుతుంది. అయితే చాలా చిన్న వయస్సులో రావటం వలన చాలా కంగారు పడుతున్నారు.
తెల్లజుట్టు వచ్చినప్పుడు మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలతో చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.
ఒక బౌల్ లో 5 స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ మందార పొడి, సరిపడా నీటిని పోసి బాగా కలిపి గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అలా వదిలేయాలి.
ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. హెన్నా మరియు కాఫీ మిశ్రమం తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడటం కన్నా ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. హెన్నా పొడి మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే గోరింటాకును నీడలో ఆరబెట్టి పొడిగా చేసుకొని వాడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


