Besan Face Clow:ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలగి కాంతివంతంగా మెరుస్తుంది
Besan Face Clow:ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలగి కాంతివంతంగా మెరుస్తుంది.. శనగ పిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.
చర్మంపై దుమ్ము,ధూళి,మలినాలు పెరుకుపోవటం వలన చర్మం కాంతివిహీనంగా కనపడుతుంది. ముఖ చర్మం మచ్చలు ఏమి లేకుండా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే ప్యాక్ ట్రై చేయండి. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ కి ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పెసర పిండి, అరస్పూన్ ఎర్ర కందిపప్పు పిండి, అరస్పూన్ శనగపిండి,పావు స్పూన్ వేపాకుల పొడి,సరిపడా పాలను పోసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

పెసరపిండిని చర్మ సంరక్షణలో పూర్వ కాలం నుండి వాడుతున్నారు. పెసరపిండి చర్మంపై ఉండే మృత కణాల్ని తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నల్లటి చర్మం కూడా తెల్లగా మారటానికి పెసలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని విటమిన్ A, C… చర్మాన్ని కాపాడతాయి. అలాగే వీటిలోని ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు కూడా చర్మం కందిపోకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఎర్ర కందిపప్పును మసూర్ పప్పు అని కూడా పిలుస్తారు. చర్మ రంధ్రాలను టైట్ చేయడం నుంచి ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించడం వరకు సహాయపడతాయి.అలాగే మృత కణాలను తొలగించటానికి కూడా సహాయపడుతుంది. శనగపిండి అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. వేపలో ఉండే లక్షణాలు చర్మంపై మొటిమలను తగ్గించటానికి సహాయపడుతుంది.

ఈ ప్యాక్ వారంలో రెండు సార్లు వేసుకుంటే ముఖం మీద మలినాలు,మచ్చలు,మృత కణాలు ఆన్ని తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో సులభంగా దొరికే వస్తువులను ఉపయోగించి తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చిట్కా తప్పనిసరిగా ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


