Beauty Tips

Hair Care Tips:ఈ పేస్ట్ జుట్టుకి రాస్తే చాలు జుట్టు రాలకుండా చాలా స్పీడ్ గా పెరుగుతుంది

Hair Care Tips:ఈ పేస్ట్ జుట్టుకి రాస్తే చాలు జుట్టు రాలకుండా చాలా స్పీడ్ గా పెరుగుతుంది..జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన సమస్య తగ్గకుండా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది.
kalabanda benefits in telugu
ఇప్పుడు చెప్పే చిట్కా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల వేప పొడి, ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఇలా చేయటం వలన జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి అన్నీ రకాల జుట్టుకి సంబందించిన సమస్యలు తొలగిపోతాయి. వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రు సమస్యను తొలగిస్తాయి.
amudam
ఆలోవెరా జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఆముదం (Castor Oil) వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషణ ఇచ్చి బలంగా మారేలా చేస్తుంది. ఆముదం రాసుకొన్నట్లయితే.. జుట్టు పొడవుగా, బలంగా తయారవుతుంది. దీని వల్ల జుట్టు తెగిపోదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.