Beauty Tips

Lemon Peels : నిమ్మకాయ తొక్కలతో చర్మ సమస్యలు, నల్ల మచ్చలు, ముడతలు మాయం..

Lemon Peels : నిమ్మవల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదే విధంగా నిమ్మకాయ పైన ఉండే తొక్కుతో కూడా వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

నిమ్మ తొక్కలను ఎండ బెట్టి మెత్తని పొడి మార్చుకొని నిల్వచేసుకోవచ్చు. ఈ పొడి ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.

నిమ్మకాయ తొక్కలతో చర్మ సమస్యలు, నల్ల మచ్చలు, ముడతలు మాయం.. ముఖం అందంగా కనపడాలంటే ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా ఉండాలి. నల్లని మచ్చలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా మొండి మచ్చలను తొలగించటానికి సహాయపడుతుంది.

ముఖ సంరక్షణలో ఖరీదైన క్రీమ్ లను అసలు వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో సహజసిద్దంగా ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా మొండి మచ్చలను తొలగించుకోవచ్చు. రెండు నిమ్మకాయలను తీసుకోని రసం తీసి తొక్కలను పక్కన పెట్టాలి.

నిమ్మ తొక్కలను నీటిలో వేసి ఉడికించి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మ తోక్కల పేస్ట్, అరస్పూన్ గందం పొడి, అరస్పూన్ ములేటి పౌడర్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం మీద నల్లని మొండి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ