Beauty Tips

White Hair: ఎంత ప్రయత్నించినా తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం లేదా..? ఒక్కసారి ఈ నూనెను ట్రై చేయండి..

White Hair: ఎంత ప్రయత్నించినా తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం లేదా..? ఒక్కసారి ఈ నూనెను ట్రై చేయండి.. రోజురోజుకూ తెల్ల జుట్టు అనేది క్లిష్టమైన సమస్యగా మారిపోతోంది. చాలా చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వల్ల చాలా మంది యువత చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నారు.

తెల్లజుట్టు కవర్ చేయడం కోసం మంచిది కాదని తెలిసినా రసాయనాలున్న షాంపూలు, హెయిర్ డైలు వాడుతున్నారు. దీనివల్ల జుట్టు తాత్కాలికంగా నల్లబడు తుందేమో కానీ జుట్టు మూలాలు బలహీన పడటం, మెదడు కణాలు, మెదడు లోపలి నరాలు తీవ్ర నష్టానికి గురికావడం జరుగుతాయి.

ఇవేవీ అవసరం లేకుండా చాలా సహజంగా జుట్టు శాశ్వతంగా నల్లగా మారడానికి కింద చెప్పుకున్న పొడిని వాడితే కేవలం 30రోజుల్లోనే తెల్లజుట్టు మాయమవుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

తెల్లజుట్టు సమస్య,జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం.

ఈ నూనె రాయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా సాగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయలను తురుముకుని వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకు., గుప్పెడు కట్ చేసిన మందార ఆకులు, 100 గ్రాముల మెంతులు, రెండు స్పూన్ల kalonji seeds, గుప్పెడు గుంటగలగరాకు, గుప్పెడు కరివేపాకు వేసి దానిలో అరకేజీ కొబ్బరి నూనె వేయాలి.

ఇప్పుడు పొయ్యిమీద పెట్టి తక్కువ మంటలో పదార్థాలన్నీ కలుపుతూ నల్లగా మారే అంతవరకు నూనెను మరిగించుకోవాలి. ఈ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ తలకు రాసుకుంటూ రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తల మీద చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె దాదాపుగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.