Beauty Tips

Face Glow Tips:బియ్యంపిండిలో పసుపు కలిపి ముఖానికి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది

Face glow tips:బియ్యంపిండిలో పసుపు కలిపి ముఖానికి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది.. ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే అవి పెద్దగా పలితాన్ని ఇవ్వక చాలా నిరుత్సాహానికి గురి అవుతారు.

వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం, ముఖానికి సరైన పోషణ లేకపోవటం, ఎండలో ఎక్కువగా తిరగటం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు, జిడ్డు వంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడతారు. కానీ ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దాని కోసం బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యంపిండి, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల పెరుగు, విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి. ఈ ప్యాక్ ముఖానికి వేయటం వలన చర్మానికి తగినంత తేమ అందుతుంది.

అలాగే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. బియ్యంపిండి మృతకణాలను తొలగించటానికి, పసుపు, పెరుగు లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందించటమే కాకుండా చర్మ ఛాయ మెరుగుపడటానికి సహాయపడతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఇలా ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ