Tips For White Hair – ఇవి వాడారంటే.. తెల్లజుట్టు రానే రాదు
White Hair Care Tips: తెల్లజుట్టు కారణంగా పెద్ద వయసు ఉన్న వారిలా కనిపిస్తున్నారు. పోషకాల లోపం, ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవడం, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణంగా వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది.
ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, ఒత్తిడి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది.
తెల్లజుట్టు చాలా చిన్న వయసులో రావటం వలన చాలా మంది బయటకు వెళితే ఎక్కడ హేళన చేస్తారో అని మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్ వేసుకుంటే చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆమ్లా పొడి, ఒక స్పూన్ హెన్నా పొడి, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ బ్రహ్మీ పొడి, ఒక స్పూను బృంగరాజు పొడి, ఒక స్పూను మందార పువ్వుల పొడి, ఒక స్పూన్ త్రిఫల పొడి వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇక ఇప్పుడు దీనిలో టీ డికాషన్ పోసి బాగా కలిపి ఒక గంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంట అయ్యాక హెర్బల్ షాంపు ఉపయోగించి జుట్టును శుభ్రం చేయాలి. ఈ విధంగా నెలలో మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు అసలు ఉండదు.
ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని రకాల పదార్థాలుమెలనిన్ స్థాయిలను పెంచటానికి చాలా అద్భుతంగా పనిచేసి తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది.కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

