Beauty Tips

Stretch Marks: ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పోలేదా.. ఈ హోం రెమెడీస్‌తో వదిలించుకోండి.. !

How to remove stretch marks: స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడానికి ప్రజలు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తారు. ఈ రకమైన ఉత్పత్తులు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు ఈ హోం రెమెడీస్ తో స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా తొలగించుకోవచ్చు.

పసుపును అన్ని రకాల చర్మ తత్వాలు ఉన్నవారు ఉపయోగించవచ్చు. పసుపులో యాంటి సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను తొలగించి చర్మం కాంతివంతంగా మారేలా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పసుపులో బ్లీచింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. కొంచెం పసుపులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసి పిగ్మెంటేషన్ ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. కాలిన గాయాలపై పసుపును ఆలివ్ ఆయిల్ లో కలిపి రాస్తే తొందరగా మానతాయి. పసుపు ముడతలను కూడా సమర్ధవంతంగా తొలగిస్తుంది. ఒక స్పూన్ పసుపులో బియ్యంపిండి,టమోటా రసం,పాలు కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలాగే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది. పసుపు స్ట్రెచ్ మార్కులను  తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును శనగపిండి మరియు పాలతో కలిపి పేస్ట్ గా చేసి  స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక రబ్ చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ