Beauty Tips

Hair Care Tips:ఊడిన జుట్టు ప్లేస్ లో ఒత్తుగా పెంచే నూనె ఇది..

Best Hair Oil:ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం (Hair fall). కాలుష్యం, ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందికి ఇది కామన్ ప్రాబ్లమ్‌గా మారింది. అయితే జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి, హెయిర్ గ్రోత్‌ను పెంచడానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. అదే నూనె రాయడం.

ఈ సీజన్లో ఎక్కువగా జుట్టు రాలే సమస్య వేధిస్తూ ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులు, తరచుగా వానల్లో తడవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. దాంతో జుట్టు రాలే సమస్య రాగానే చాలామంది కంగారు పడిపోయి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
Hair Care
మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే ఆయిల్ ఈ సీజన్లో జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పే నూనె చాలా సులభంగానే లభ్యం అవుతుంది. కాస్త ఓపికగా ఈ నూనెను వాడితే సరిపోతుంది.
Tea Tree Oil
టీట్రీ ఆయిల్‌ జుట్టు సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్ టీట్రీ ఆయిల్‌ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

టీట్రీ ఆయిల్ లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన చర్మంలోనికి డీప్ గా చొచ్చుకుని పోయి, తలకు, జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. టీట్రీ ఆయిల్లో టెర్పినిన్ 4 అనే కంటెంట్ ఉంటుంది. ఇది తలలో మురికిని తొలగిస్తుంది. మూసుకుపోయిన రంద్రాలను శుభ్రం చేస్తుంది. చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.
hair fall tips in telugu
తలలో చర్మరంద్రాలు క్లియర్ అయిన తర్వాత, తలలో హెయిర్ ఫోలిసెల్స్ ఎటువంటి అంతరాయం జరగకుండా పెరగడం సులభం అవుతుంది. కాబట్టి ఈ ఆయిల్ ని ఉపయోగించి జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్యల నుండి బయట పడి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ