Beauty Tips

Skin Care Tips:వేసవిలో ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాస్తే ఏమి జరుగుతుందో తెలుసా..

Skin CAre Tips:వేసవిలో ముఖంపై పుచ్చకాయ రసాన్ని రాస్తే ఏమి జరుగుతుందో తెలుసా.. వేసవికాలం వచ్చింది అంటే ముఖం మీద చెమట,జిడ్డు చాలా ఎక్కువ అయిపోతాయి ఈ సమస్యను తగ్గించుకోవటానికి మనం ఇంటి చిట్కాలను ఫాలో అవ్వచ్చు. వేసవి కాలంలో ఎక్కువగా పుచ్చకాయ లభ్యమవుతుంది. పుచ్చకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అలాగే చర్మానికి కూడా మేలు చేస్తుంది. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా డిహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడేస్తుంది. మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి వాటిని తగ్గించడానికి పుచ్చకాయ రసం చాలా బాగా సహాయపడుతుంది.

పుచ్చకాయ రసాన్ని ముఖం మీద రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం తేమగా ఉండటమే కాకుండా చర్మం సహజసిద్ధమైన మెరుపును కలిగి ఉంటుంది.

చర్మం పొడిగా లేకుండా ఉంటుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన మొటిమల సమస్య తొలగిపోతుంది. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ముఖం మీద ఉన్న నల్లని మచ్చలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే పుచ్చకాయ రసంలో కొంచెం పాలు కలిపి కూడా ముఖానికి రాయవచ్చు. ఇలా రాస్తే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ