Beauty Tips

Homemade Hair Oil: ఈ ఆయిల్స్ వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు.. జుట్టు అసలు రాలదు..

Homemade Hair Oil: ఈ ఆయిల్స్ వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు.. జుట్టు అసలు రాలదు.. చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు వంటివి వచ్చేస్తున్నాయి. దాంతో కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొని వాడేస్తూ ఉంటారు.

ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.

కలబందలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యను, జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. అరకప్పు కలబంద జెల్లో అరకప్పు కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తక్కువ మంట మీద ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేడి చేసి చల్లారిన తర్వాత దానిలో నాలుగు లేదా ఐదు చుక్కల రోజు మేరీ నూనె వేసి బాగా కలపాలి.

ఈ నూనెను ఒక గాజు సీసాలో పోసి రెండు వారాలపాటు కదపకుండా అలా ఉంచేయాలి. ఆ తర్వాత ఈ నూనెను వాడొచ్చు. ఈ నూనెను వారంలో రెండు సార్లు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంటయ్యాక తల స్నానం చేస్తే సరిపోతుంది.

కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే పురాతన కాలం నుండి కొబ్బరి నూనెను వాడుతూ ఉన్నారు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి గాజు సీసాలో నిల్వ చేయాలి. వారంలో మూడుసార్లు జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు సమస్య నుండి బయటపడవచ్చు.

నువ్వుల నూనె జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. ఒక కప్పు నువ్వుల నూనెలో మూడు స్పూన్ల అల్లం పేస్ట్ వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను వడగట్టి సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను వారంలో రెండు సార్లు జుట్టుకు పట్టిస్తే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ