Grey Hair: ఈ నూనె రాస్తే, తెల్ల జుట్టు సమస్య జీవితంలో ఉండదు..
Grey Hair: ఈ నూనె రాస్తే, తెల్ల జుట్టు సమస్య జీవితంలో ఉండదు..గతంలో తెల్ల జుట్టు వయసు మళ్లిన వారికి మాత్రమే వచ్చేది. కానీ, ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనాలతో కూడిన హెయిర్ డైల వల్ల ఇది సంభవిస్తుంది.
ఒక ఇంటి చిట్కాతో తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాతో ఇంట్లోనే సులభంగా నూనె తయారు చేసుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి నువ్వుల నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది.
నువ్వుల నూనె: 1 లీటర్
నిమ్మరసం: 2 టీస్పూన్లు
తయారీ విధానం
1. మొదటి రోజు: ఒక గిన్నెలో 1 లీటర్ నువ్వుల నూనె పోసి, సన్నని మంటపై వేడి చేయాలి. నూనెలో నురగ ఏర్పడిన తర్వాత, 2 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. దీనివల్ల నురగ మరింత పెరుగుతుంది. నూనెను నిరంతరం కలుపుతూ, నురగ తగ్గే వరకు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, నూనెలోని మలినాలను వడకట్టాలి.
2. రెండో రోజు: 24 గంటల తర్వాత, ఆ నూనెను మళ్లీ సన్నని మంటపై మరిగించాలి. నురగ తగ్గే వరకు మరిగించి, స్టవ్ ఆఫ్ చేయాలి.
3. మూడో రోజు: మరో 24 గంటల తర్వాత, నూనెను మళ్లీ మరిగించాలి. నురగ పూర్తిగా తగ్గాక, నూనె చల్లారిన తర్వాత వడకట్టి, ఒక శుభ్రమైన డబ్బాలో నిల్వ చేయాలి.
ప్రతి రాత్రి ఈ నూనెను తలకు రాసి, జుట్టు రూట్స్‌లో బాగా మసాజ్ చేయాలి. చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి లేదా 40 ఏళ్లు దాటిన వారికి ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

