Beauty Tips

Hair Care Tips:ఎన్ని ట్రై చేసినా జుట్టు రాలడం ఆగట్లేదా.. ఉల్లిపాయ చిట్కాతో మీ సమస్య మాయం.. ట్రై చేయండి..

Hair Care Tips:ఎన్ని ట్రై చేసినా జుట్టు రాలడం ఆగట్లేదా.. ఉల్లిపాయ చిట్కాతో మీ సమస్య మాయం.. ట్రై చేయండి.. జుట్టు రాలడం నియంత్రించడానికి చాలా మంది మార్కెట్లో లభించే రసాయన ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.

జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తైన, మృదువైన, పొడవైన నల్లటి జుట్టు అందరూ కోరుకుంటారు. కానీ, ప్రస్తుత జీవనశైలి, దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల జుట్టు నిర్జీవంగా మారుతోంది.

దీని కారణంగా జుట్టు రాలడం, పల్చబడటం, తెల్ల జుట్టు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది, ఇది అందాన్ని దెబ్బతీస్తోంది. పురుషులలో ఈ సమస్య తరచూ బట్టతలకు దారితీస్తోంది.

జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగించటం కన్నా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటం మంచిది. ఉల్లిపాయ రసంలోని సల్ఫర్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే ఫంగస్, బ్యాక్టీరియాను నాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషణను అందించి, మూలాల నుంచి బలపరుస్తుంది.

ఉల్లిపాయ రసంలోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చి, రాలడాన్ని తగ్గిస్తాయి. మొత్తంగా, ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ చిట్కా కోసం తాజా ఉల్లిపాయను ఎంచుకోండి. ఉల్లిపాయను ముక్కలుగా కోసి, దాని రసాన్ని తీయండి.

ఈ రసాన్ని తలపై రాసి, సున్నితంగా మసాజ్ చేయండి. ఈ పద్ధతిని వారానికి రెండు సార్లు అనుసరించండి. ఉల్లిపాయ రసంతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది, దీనితో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఉల్లిపాయ రసం తీసిన వెంటనే ఉపయోగించాలి, ఎందుకంటే ఇది కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే, ఉల్లిపాయ తాజాగా ఉండాలి. తాజా ఉల్లిపాయ గుర్తించడానికి, అది కట్ చేస్తే కళ్లలో నీళ్లు తెప్పించే ఘాటు వాసన ఉండాలి. అలాంటి ఉల్లిపాయ నుంచి తీసిన రసమే ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మీరు చేయాలనుకుంటే, ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాయవచ్చు. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టును బలోపేతం చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి రాయడం వల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యవంతంగా మారుతుంది మరియు జుట్టు రాలడం తగ్గుతుంది. గోరు వెచ్చని కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలిపి రాస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ