Devotional

Weekly Horoscope In Telugu:ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా?

Weekly Horoscope In Telugu:ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకున్నారా.. మనలో కొంత మంది జాతకాలను నమ్ముతారు. మరి కొంత మంది నమ్మటానికి ఇష్టపడరు. ఈ ఆర్టికల్ కేవలం జాతకాలను నమ్మే వరిఒ కోసం మాత్రమే..

మేషం
ఏ వ్యవహారమైనా క్రమబద్ధంగా నిర్వహించి విజయవంతంగా ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో సమావేశమై ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఊహించని సంఘటనలు ఆశ్చర్యం కలిగించవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు సానుకూల ప్రకటనలు అందవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వివాహం వంటి శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తగ్గే అవకాశం. కళారంగంలో వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఖర్చులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: గులాబీ, నేరేడు.
స్తోత్రం: నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

వృషభం
పనులలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. ఆత్మీయులతో విభేదాలు సర్దుమనిగే అవకాశం. మీ ఆలోచనలకు ఆచరణాత్మక రూపం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది, అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది. బంధుమిత్రులతో ఉత్సాహంగా సమయం గడుపుతారు. గృహనిర్మాణంలో అడ్డంకులు తొలగుతాయి.

వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆందోళన తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు సానుకూల సమయం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం, సన్నిహితుల నుంచి ఒత్తిడి ఉండవచ్చు.
అదృష్ట రంగులు: గులాబీ, తెలుపు.
స్తోత్రం: విష్ణు సహస్రనామం పఠించండి.

మిథునం
మధ్యలో సమస్యలు, వివాదాలు ఎదురైనప్పటికీ, ధైర్యంతో అధిగమిస్తారు. పట్టుదల మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు సాఫీగా సాగుతాయి. నీరసంగా ఉన్నవారికి శుభవార్త ఊరట కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కుదురుతాయి. ఆలయ సందర్శన, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవించవచ్చు. రాజకీయవర్గాలకు ఆనందకరమైన వార్తలు. వారం మధ్యలో బంధువులతో తగాదాలు, ఆరోగ్య సమస్యలు, ధనవ్యయం ఉండవచ్చు.
అదృష్ట రంగులు: పసుపు, నేరేడు.
స్తోత్రం: గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం
నూతన ఉత్సాహంతో పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేస్తారు. వాహనం, గృహం కొనుగోలు చేసే అవకాశం.

ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభదాయక దిశలో సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు.
అదృష్ట రంగులు: ఎరుపు, పసుపు.
స్తోత్రం: శ్రీ మహావిష్ణు ధ్యానం పఠించండి.

సింహం
ప్రారంభంలో వివాదాలు, సమస్యలు ఎదురైనా, క్రమంగా తొలగిపోతాయి. సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగై ఊరట లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందిస్తారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు, కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: నీలం, ఆకుపచ్చ.
స్తోత్రం: నృసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తీరే సమయం. బంధువుల సలహాలను ఆదరిస్తారు.

సేవా కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనలో పాల్గొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. గృహయోగం లభిస్తుంది. వ్యాపారాలు క్రమంగా విస్తరిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అందుతాయి. కళారంగంలో వారికి యత్నం సఫలమవుతుంది. వారం ప్రారంభంలో ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: ఎరుపు, నేరేడు.
స్తోత్రం: ఆదిత్య హృదయం పఠించండి.

తుల
మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులను స్వశక్తితో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి ఆహ్వానం అందడంతో ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. బంధువులతో భావాలను పంచుకుంటారు. గృహనిర్మాణంలో అడ్డంకులు తొలగుతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు, ఒడిదుడుకులు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాల యత్నం ఫలిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు, మిత్రులతో విభేదాలు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: గులాబీ, తెలుపు.
స్తోత్రం: ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం
ఏ పనినైనా పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న అవకాశం చేజారే సూచనలు ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి, రుణ బాధలు తొలగుతాయి.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందం పంచుకుంటారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గే అవకాశం. పారిశ్రామికవర్గాల యత్నం ఫలిస్తుంది. వారం చివరిలో ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: తెలుపు, నేరేడు.
స్తోత్రం: శ్రీ సూర్య ప్రార్థన పఠించండి.

ధనుస్సు
మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనా, ధైర్యంగా నిలబడతారు. ఆలోచనలకు మరింత స్పష్టత తెస్తారు. ఏ పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. భూ వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయ సందర్శన ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు. గృహనిర్మాణంలో అనుకూల పరిస్థితులు.

పెళ్లి చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. కళారంగంలో ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు, ఆత్మీయులతో విభేదాలు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: ఎరుపు, నీలం.
స్తోత్రం: హయగ్రీవ ధ్యానం పఠించండి.

మకరం
నూతన ఉత్సాహంతో పనులను చక్కబెట్టుకుంటారు. సన్నిహితుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలపై బంధువులతో చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతన ఉత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబ ఒత్తిడులు, శ్రమాధిక్యం ఉండవచ్చు.
అదృష్ట రంగులు: తెలుపు, గులాబీ.
స్తోత్రం: శివాష్టకం పఠించండి.

కుంభం
మీ మాటకు ఎదురు ఉండదు. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. లక్ష్య సాధనలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు క్రమంగా పుంజుకుంటాయి. దూరపు బంధువులతో సమావేశం. వ్యతిరేకులు అనుకూలంగా మారి సహకరిస్తారు. వివాహాది శుభకార్యాలపై నిర్ణయాలు. వ్యాపార విస్తరణ పూర్తవుతుంది. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగంలో సానుకూల ఫలితాలు. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.
అదృష్ట రంగులు: ఆకుపచ్చ, నేరేడు.
స్తోత్రం: శ్రీ కృష్ణ స్తుతి పఠించండి.

మీనం
ఆర్థిక స్థితి కొంత నిరాశ కలిగించినా, కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడి ఎదురవ్వచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. గృహనిర్మాణంలో అడ్డంకులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువుల వైఖరితో మనస్తాపం. వ్యాపారాలు స్వల్ప లాభాలిస్తాయి.

విస్తరణలో జాప్యం. ఉద్యోగులకు గందరగోళం. పారిశ్రామికవర్గాలు జాగ్రత్తగా అడుగులు వేయాలి. వారం మధ్యలో శుభవార్తలు, నూతన ఉద్యోగ అవకాశాలు, ఆస్తి లాభం ఉండవచ్చు.
అదృష్ట రంగులు: నేరేడు, ఆకుపచ్చ.
స్తోత్రం: సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.