Mustard Oil For Hair:ఆవాల నూనెతో ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది..
Mustard Oil For Hair:ఆవాల నూనెతో ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.. పొడవాటి, ఒత్తైన జుట్టు కోరుకోని అమ్మాయి ఎవరైనా ఉంటారా? కానీ ఈ రోజుల్లో చాలామంది జుట్టు రాలిపోవడం, ఒత్తిడి, కాలుష్యం, దుమ్ము, ధూళి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నప్పటికీ, ఫలితాలు సంతృప్తికరంగా ఉండటం లేదు. అయితే, ఆవాల నూనె జుట్టు రాలడాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ జుట్టును సంరక్షిస్తాయి. ఆవాల నూనె జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేసి, చుండ్రును తగ్గిస్తుంది.
కాబట్టి, ఈ నూనెతో కొన్ని పదార్థాలను కలిపి ఉపయోగిస్తే, నడుము వరకు జుట్టు పొడవుగా పెరగడం ఖాయం. ఈ హెయిర్ ఆయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
– ఆవాల నూనె
– మందారం పుష్పాలు
– కరివేపాకు
– మందారం ఆకులు
– ఉసిరికాయ
– లవంగాలు
తయారీ విధానం:
1. స్టవ్ మీద కడాయి పెట్టి, రెండు కప్పుల ఆవాల నూనె వేయండి.
2. అందులో ఉసిరికాయ ముక్కలు, మందారం పుష్పాలు, కరివేపాకు, మందారం ఆకులు, 4 లవంగాలు వేసి, బ్రౌన్ రంగు వచ్చే వరకు మరిగించండి.
3. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేయండి.
4. ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు రాసుకోవచ్చు లేదా తలకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసి, గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయండి.
5. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే, జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా మారుతుంది.
ఆవాల నూనెతో ఇతర చిట్కాలు:
1. ఆవాల నూనె, పెరుగు హెయిర్ మాస్క్:
– చిన్న గిన్నెలో కావాల్సినంత ఆవాల నూనె, 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి జుట్టుకు రాయండి.
– అరగంట తర్వాత తలస్నానం చేయండి.
– వారానికి రెండుసార్లు చేస్తే, జుట్టు మృదువుగా, మెరిసేలా ఉంటుంది.
2. ఆవాల నూనె, కలబంద హెయిర్ మాస్క్:
– అరకప్పు ఆవాల నూనెలో ఫ్రెష్ అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయండి.
– ఈ మిశ్రమాన్ని తలకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయండి.
– వారానికి రెండుసార్లు చేస్తే, జుట్టు పొడవుగా పెరవడంతో పాటు చుండ్రు సమస్య తగ్గుతుంది.
3. ఆవాల నూనె, నిమ్మరసం:
– ఆవాల నూనెలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి, 10 నిమిషాలు జుట్టుకు మసాజ్ చేయండి.
– గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.
– ఇలా చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది.
4. ఆవాల నూనె, అరటిపండు హెయిర్ మాస్క్:
– అరకప్పు ఆవాల నూనెలో బాగా పండిన అరటిపండు గుజ్జు కలిపి మిక్స్ చేయండి.
– ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయండి.
– వారానికి రెండుసార్లు చేస్తే, జుట్టు రాలడం తగ్గి, పొడవుగా, సిల్కీగా మారుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తే, మీ జుట్టు సమస్యలు తగ్గి, అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు సొంతం అవుతుంది. ఒకసారి ట్రై చేయండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

