Upcoming Smartphones : జూన్‌లో రాబోయే 10 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సింగిల్ క్లిక్‌తో ఫుల్ డీటెయిల్స్!
Upcoming Smartphones : జూన్‌లో రాబోయే 10 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫోన్లు ఉన్నాయంటే? సింగిల్ క్లిక్‌తో ఫుల్ డీటెయిల్స్.. కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? భారత మార్కెట్లో ప్రస్తుతం అనేక బ్రాండ్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.
రాబోయే నెలలో మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. వీటిలో వన్‌ప్లస్, ఒప్పో, షావోమీ, నథింగ్ వంటి బ్రాండ్లు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ఫోన్లు ఆకర్షణీయ ఫీచర్లు, స్మార్ట్ ఏఐ, శక్తిమంతమైన చిప్‌లతో వస్తున్నాయి. గేమింగ్, ఫోటోగ్రఫీ, ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జూన్ 2025లో లాంచ్ కానున్న 10 స్మార్ట్‌ఫోన్‌లను ఒకసారి వివరంగా తెలుసుకుందాం:
1. వన్‌ప్లస్ 13s:
వన్‌ప్లస్ 13s అద్భుత ఫీచర్లతో వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 6.32-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే, 32MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. వన్‌ప్లస్ ఏఐ సూట్+ కూడా ఇందులో ఉంటుంది. జూన్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
2. షావోమీ మిక్స్ ఫ్లిప్ 2:
ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎదురుచూసేవారికి షావోమీ మిక్స్ ఫ్లిప్ 2 ఆదర్శమైన ఎంపిక. 6.85-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, రెండు 50MP బ్యాక్ కెమెరాలు, 67W ఛార్జింగ్‌తో 5100mAh బ్యాటరీ ఉన్నాయి. జూన్‌లో లాంచ్ కానుంది.
3. ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G:
గేమింగ్ ప్రియులకు ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G అద్భుతమైన ఎంపిక. 6.78-అంగుళాల 144Hz AMOLED స్క్రీన్, 108MP మెయిన్ కెమెరా, 5500mAh బ్యాటరీ, 45W వైర్డ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. 10 కస్టమైజ్డ్ LED లైటింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. జూన్ 3, 2025న లాంచ్ కానుంది.
4. ఒప్పో రెనో 14 సిరీస్:
ఒప్పో రెనో 14, రెనో 14 ప్రో రెండు మోడళ్లు జెమిని ఏఐ, అత్యాధునిక కెమెరా టెక్నాలజీతో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15, కలర్‌ఓఎస్ 15తో రన్ అవుతాయి. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఉత్తమ ఎంపిక. జూన్ 2025లో లాంచ్ అవుతుంది.
5. పోకో F7 5G:
పోకో F7 5G రెడ్‌మి టర్బో 4 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్, 1.5K OLED డిస్‌ప్లే, 7550mAh బ్యాటరీతో గేమింగ్, బ్యాటరీ లైఫ్‌లో రాణిస్తుంది. జూన్ 2025 ప్రారంభంలో లాంచ్ కానుంది.
6. నథింగ్ ఫోన్ (3):
నథింగ్ నుంచి మూడో జనరేషన్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్, 6.67-అంగుళాల AMOLED స్క్రీన్, 64MP మెయిన్ కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. జూన్ 2025లో లాంచ్ అవుతుంది.
7. సోనీ ఎక్స్‌పీరియా 1 VII:
6.5-అంగుళాల OLED HDR డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో సోనీ ఎక్స్‌పీరియా 1 VII రానుంది. ఏఐ ఆటో-ఫ్రేమింగ్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, డాల్బీ అట్మోస్ సౌండ్, హై-రెస్ ఆడియో ప్లేబ్యాక్ ఉన్నాయి. జూన్ 4, 2025న లాంచ్ కానుంది.
8. మోటోరోలా ఎడ్జ్ 2025:
6.7-అంగుళాల సూపర్ HD pOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్, 50MP కెమెరాతో వస్తుంది. మోటో ఏఐ ఫీచర్లకు ఏఐ కీ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. జూన్ 5, 2025న లాంచ్ కానుంది.
9. ఆల్కాటెల్ V3 సిరీస్:
ఆల్కాటెల్ V3 అల్ట్రా, V3 ప్రో, V3 క్లాసిక్ మోడళ్లు NXTPAPER డిస్‌ప్లేతో వస్తున్నాయి, ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ధర సుమారు రూ. 12,999 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 2, 2025న లాంచ్ అవుతుంది.
10. షిఫ్ట్‌ఫోన్ 8:
క్వాల్‌కామ్ QCM6490 ఆధారిత ఎకో-ఫ్రెండ్లీ మాడ్యులర్ ఫోన్. IP67 వాటర్ రెసిస్టెన్స్, శక్తిమంతమైన కెమెరా, గేమింగ్ సామర్థ్యాలతో వస్తుంది. జూన్ 2025లో అందుబాటులోకి రానుంది.

