Business

Ayushman Card :రూ. 5లక్షలు ఉచిత వైద్యం ఇచ్చే కార్డ్.. ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Ayushman Card :రూ. 5లక్షలు ఉచిత వైద్యం ఇచ్చే కార్డ్.. ఇలా అప్లయ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..సీనియర్ సిటిజన్లకు శుభవార్త! 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద ప్రత్యేక ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది. ఆయుష్మాన్ వే వందన కార్డు ద్వారా సీనియర్ సిటిజన్లు ఉచిత ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ కార్డు కోసం అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఆయుష్మాన్ కార్డు బీమా వివరాలు:
– వయస్సు అర్హత: 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
– బీమా కవరేజీ: సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.
– సేవలు: ప్రభుత్వ లేదా ఎంప్యానెల్డ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందులు, పరీక్షలు, ICU, సర్జరీలు ఉచితం.
– కవరేజీ విస్తృతి: 27 స్పెషాలిటీలు, 1,961 వైద్య విధానాలు (మెడికల్ ప్రొసీజర్స్).
– ఆదాయ పరిమితి: ఆదాయంతో సంబంధం లేకుండా అందరూ అర్హులు.
– వర్తింపు: రిటైర్డ్ అయినా, ఉద్యోగంలో ఉన్నా లేదా ఆదాయం లేకపోయినా ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
– 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా.
– ఆదాయం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అర్హత ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం:
1. ఆయుష్మాన్ యాప్ డౌన్‌లోడ్: గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి “ఆయుష్మాన్” యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
2. లాగిన్: లబ్ధిదారుడు (Beneficiary) లేదా ఆపరేటర్‌గా లాగిన్ అవ్వండి.
3. వివరాలు నమోదు: క్యాప్చా, మొబైల్ నంబర్, అథెంటికేషన్ మెథడ్‌ను ఎంటర్ చేయండి.
4. ఆధార్ వివరాలు: లబ్ధిదారుని రాష్ట్రం, ఆధార్ నంబర్‌ను సమర్పించండి.
5. eKYC ప్రక్రియ: OTP ఆధారిత eKYCని పూర్తి చేయండి.
6. డిక్లరేషన్ ఫారమ్: వ్యక్తిగత వివరాలతో డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించండి.
7. మొబైల్ నంబర్, OTP: దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్, OTPని ఎంటర్ చేయండి.
8. అదనపు వివరాలు: కేటగిరీ, పిన్ కోడ్ వంటి వివరాలను సమర్పించండి.
9. కుటుంబ సమాచారం: అవసరమైతే కుటుంబ సభ్యుల వివరాలను జోడించండి.
10. కార్డు డౌన్‌లోడ్: వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆయుష్మాన్ కార్డును యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ పథకం సీనియర్ సిటిజన్ల ఆరోగ్య అవసరాలను సమర్థవంతంగా తీర్చడానికి రూపొందించబడింది. దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!