Business

JNVS Notification:జవహర్ నవోదయ నోటిఫికేషన్ విడుదల..సీటు కొడితే చదువంతా ఫ్రీ.. దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తీ వివరాలు..

JNVS Notification:జవహర్ నవోదయ నోటిఫికేషన్ విడుదల..సీటు కొడితే చదువంతా ఫ్రీ.. దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తీ వివరాలు.. జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యార్థులు జూన్ 15, 2025 నుంచి జూలై 29, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 654 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి సీట్ల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశాల కోసం రెండు దశల్లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో మొదటి దశ పరీక్ష 2025 డిసెంబర్ 13 (శనివారం) ఉదయం 11:30 గంటలకు, జమ్మూ కశ్మీర్‌తో పాటు పర్వత ప్రాంతాల్లో రెండో దశ పరీక్ష 2026 ఏప్రిల్ 11న ఉదయం 11:30 గంటలకు జరుగుతుంది. ఫలితాలు 2027 జూన్‌లో వెల్లడవుతాయి.

అర్హతలు:
– 5వ తరగతి పూర్తి చేసినవారు లేదా 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్నవారు.
– విద్యార్థులు మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం:
– అధికారిక వెబ్‌సైట్‌లు: [navodaya.gov.in](https://navodaya.gov.in) లేదా [cbseitms.rcil.gov.in](https://cbseitms.rcil.gov.in/nvs/).
– వెబ్‌సైట్‌లో JNVST 6వ తరగతి రిజిస్ట్రేషన్ (2026-27) లింక్‌పై క్లిక్ చేయాలి.
– సమాచారం నమోదు చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
– లాగిన్ అయ్యి, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 15, 2025
– దరఖాస్తు చివరి తేదీ: జూలై 29, 2025
– పరీక్ష తేదీలు:
– తెలుగు రాష్ట్రాలు & ఇతర రాష్ట్రాలు: డిసెంబర్ 13, 2025 (ఉదయం 11:30)
– జమ్మూ కశ్మీర్ & పర్వత ప్రాంతాలు: ఏప్రిల్ 11, 2026 (ఉదయం 11:30)
– ఫలితాలు: జూన్ 2027

పరీక్షా విధానం:
– మొత్తం 100 మార్కులకు 80 ప్రశ్నలు.
– వ్యవధి: 2 గంటలు.
– విభాగాలు: మెంటల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు), అర్థమెటిక్ (20 ప్రశ్నలు), లాంగ్వేజ్ టెస్ట్ (20 ప్రశ్నలు).
– నెగెటివ్ మార్కులు లేవు.

అవసరమైన పత్రాలు:
– జన్మ తేదీ ధృవపత్రం
– నివాస ధృవపత్రం
– కుల ధృవపత్రం
– ఆదాయ ధృవపత్రం
– ఆధార్ కార్డు
– హెడ్‌మాస్టర్ ధృవీకరించిన సర్టిఫికెట్
– వైద్య ఫిట్‌నెస్ ధృవపత్రం
– మైగ్రేషన్ సర్టిఫికెట్
– దివ్యాంగ విద్యార్థులకు సంబంధిత ధృవపత్రం
– అడ్మిషన్ సమయంలో టీసీ సమర్పించాలి.

దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తి చేసుకోవడానికి వెబ్‌సైట్‌లో సూచనలను జాగ్రత్తగా అనుసరించండి.