Beauty Tips

Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు.. బ్యూటీ పార్లర్ అవసరమే రాదు..

Face Glow: ఈ చిన్న గింజల జెల్ రాస్తే చాలు.. బ్యూటీ పార్లర్ అవసరమే రాదు..చియా సీడ్స్ నీటిని తాగడం వల్ల ముఖంలో సహజసిద్ధమైన అందం పెరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే, చియా సీడ్స్‌తో ఫేషియల్ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా?

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? ముఖ్యంగా అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికి రకరకాల క్రీములు, సీరమ్‌లు ఉపయోగిస్తారు. కానీ, ఇవి ఎక్కువగా ప్రయోజనం చేకూర్చవు, అంతేకాకుండా ఖరీదైనవి కూడా. పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫేషియల్ కంటే గొప్ప గ్లోని సొంతం చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.

చియా సీడ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు వీటిని బరువు తగ్గడానికి ఉపయోగించి ఉండవచ్చు. కానీ, చియా సీడ్స్‌తో మీ అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. చియా సీడ్స్ నీటిని తాగడం వల్ల ముఖంలో అందం పెరుగుతుంది, అయితే వీటితో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు.

ఇంట్లోనే చియా సీడ్స్‌తో స్పెషల్ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. రెండు స్పూన్ల చియా సీడ్స్‌ను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, నీటి నుంచి సీడ్స్‌ను వేరు చేసి, మిక్సర్ లేదా బ్లెండర్‌లో మెత్తని పేస్టులా చేయాలి. ఈ పేస్టుకు పెరుగు, కలబంద గుజ్జు కలిపి మరింత మెత్తని మిశ్రమంగా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన ఉంచి, తర్వాత ముఖానికి అప్లై చేయాలి.

ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్‌ను వాడవచ్చు. మొదటిసారి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఫేస్ ప్యాక్‌ను 20-25 నిమిషాలు ముఖంపై ఉంచి, తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, మీ ముఖం యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ