Beauty Tips

Korean SkinCare Routine: బెస్ట్ కొరియన్ ఫేసియల్స్ టిప్స్.. మెరిసే అందమైన ముఖం మీ సొంతం..

Korean SkinCare Routine: బెస్ట్ కొరియన్ ఫేసియల్స్ టిప్స్.. మెరిసే అందమైన ముఖం మీ సొంతం.. అందరూ తమ ముఖం తెల్లగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. చాలామంది కొరియన్ చర్మంలాంటి మెరిసే చర్మం కావాలని ఆశపడతారు. దీని కోసం రకరకాల ఫేస్ క్రీములను వాడతారు. కానీ, ఈ క్రీముల వల్ల ఫలితం వచ్చినా వచ్చకపోయినా, చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

అంతేకాదు, మార్కెట్‌లో లభించే ఈ క్రీముల వాడకం వల్ల కొన్నాళ్లకే వయసు మీద పడినట్లు కనిపించవచ్చు. కాబట్టి, వీలైనంతవరకు ఈ క్రీముల వాడకాన్ని తగ్గించి, ఇంట్లోనే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించండి. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి, మీ ముఖం కొద్ది నిమిషాల్లోనే తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. కొరియన్ చర్మంలాగా మీ ముఖం మెరుస్తుంది. ఈ సహజ ఫేస్ ప్యాక్‌లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టెప్ – 1
ముందుగా ఒక గిన్నెలో బియ్యం నీటిని (రైస్ వాటర్) తీసుకుని, అందులో దూది లేదా కాటన్ గుడ్డను ముంచి, ముఖంపై రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపైని మృతకణాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

స్టెప్ – 2
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి. దీన్ని ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మిలమిలలాడుతూ కాంతివంతంగా మారుతుంది.

స్టెప్ – 3
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయండి. ఈ ఫేస్ ప్యాక్ మృతకణాలను తొలగించడంతో పాటు, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

స్టెప్ – 4
ఒక చిన్న గిన్నెలో పాలు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి. దీన్ని ముఖానికి రాసి, 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే, ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

పాలు, నిమ్మరసం, పసుపు ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే, మొటిమలు, మచ్చలు తొలగిపోయి, మీ ముఖం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

కాఫీ పౌడర్, టమాటో గుజ్జు, షుగర్ ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 2 టీ స్పూన్ల కాఫీ పౌడర్, కొద్దిగా షుగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో గుజ్జు కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి. దీన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే, మీ ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ