Devotional

Jagannath Rath Yatra 2025 APSRTC Special Buses : పూరీ జగన్నాథ రథయాత్రకు APSRTC ప్రత్యేక బస్సులు .. ఇలా బుక్ చేసుకోండి..

Jagannath Rath Yatra 2025 APSRTC Special Buses : పూరీ జగన్నాథ రథయాత్రకు APSRTC ప్రత్యేక బస్సులు .. ఇలా బుక్ చేసుకోండి..ఏటా ఆషాఢ మాసంలో జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర కోసం APSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది కూడా జూన్ 27న రథయాత్రకు వెళ్లే భక్తుల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) నుంచి ప్రత్యేక బస్సుల వివరాలు:
విజయవాడ PNBS నుంచి పూరీ రథయాత్ర కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు జూన్ 25 రాత్రి 10 గంటలకు బయలుదేరుతాయి. జూన్ 26న అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తారు.

అదే రోజు సాయంత్రం ఆర్కే బీచ్‌లో కాసేపు ఆగిన తర్వాత రా 6.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతాయి. జూన్ 27న కోణార్క్ సూర్యదేవాలయ సందర్శన, అనంతరం పూరీ జగన్నాథ దర్శనం మరియు రథయాత్ర సందడిని ఆస్వాదిస్తారు. రాత్రి 1 గంట వరకు అక్కడ గడిపి, తిరిగి విజయవాడ చేరుకుంటారు.

– టికెట్ ధరలు:
– సూపర్ లగ్జరీ/హైటెక్: ఒక్కరికి రూ.3,600
– ఇంద్ర ఏసీ: ఒక్కరికి రూ.4,800

– బుకింగ్: ఆన్‌లైన్ లేదా APSRTC అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు.
– గ్రూప్ ఆఫర్:30 మంది గ్రూప్‌గా ఉంటే వారి నివాస ప్రాంతం నుంచే బస్సు ఏర్పాటు చేస్తామని APSRTC అధికారులు తెలిపారు.
– ఖర్చులు: భోజనం, ఇతర వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులు భరించాలి.
– తిరువూరు, జగ్గయ్యపేట: ఈ ప్రాంతాల నుంచి 30 మంది భక్తులు ఉంటే అక్కడి నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేస్తారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8074298487, 9515860465, 8247451915, 7382893197

రావులపాలెం APSRTC డిపో నుంచి ప్రత్యేక బస్సులు:

రావులపాలెం డిపో నుంచి జూన్ 26న బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు జూన్ 29న తిరిగి రావులపాలెం చేరుకుంటుంది. ఈ పర్యటనలో పూరీ జగన్నాథ రథోత్సవం, అరసవల్లి సూర్యనారాయణ ఆలయం, కోణార్క్ ఆలయం, భువనేశ్వర్, సింహాచలం ఆలయాలను సందర్శిస్తారు.

– టికెట్ ధర: ఒక్కరికి రూ.4,600 (ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్‌తో సహా).
– సంప్రదించాల్సిన నంబర్లు:
– డిపో మేనేజర్: 9959225537
– అసిస్టెంట్ మేనేజర్: 7382911871

ఒడిశా రవాణా ఏర్పాట్లు:
రథయాత్ర సందర్భంగా ఒడిశాలో 1,000కి పైగా ప్రత్యేక బస్సులను నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒడిశా బస్సు యజమానుల సంఘంతో రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్ సమావేశమయ్యారు. సాధారణ బస్సులతోపాటు వివిధ వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేస్తారు. ప్రత్యేక బస్సులను మాలతీపట్టపూర్, తొలబొణియా మైదానాల్లో నిలిపి, అక్కడి నుంచి రథయాత్ర ప్రదేశానికి తరలించేందుకు 100 ఆటోలు సిద్ధంగా ఉంచుతారు.

ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదని బస్సు, ఆటో ఆపరేటర్లకు సూచించారు. తొలబొణియా బస్ స్టాప్ వద్ద రూ.10కి శాఖాహార భోజనం అందుబాటులో ఉంటుంది. వాహనాల రద్దీ నియంత్రణకు జిల్లా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భువనేశ్వర్-పూరీ, పూరీ-కోణార్క్, పిప్పిలి-పూరీ వంటి కీలక మార్గాల్లో రవాణా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.