DevotionalToday Rasi Phalalu In telugu

Daily Horoscope:june 19..12 రాశుల ఫలితాలు.. ఈ రాశి వారికీ ఆకస్మిక ధన లాభం..

Daily Horoscope:june 19.. 12 రాశుల ఫలితాలు.. ఈ రాశి వారికీ ఆకస్మిక ధన లాభం.. జాతకాలను మనలో చాలా మంది నమ్ముతారు. అలాగే కొంత మంది నమ్మరు.

మేషం
కర్మసిద్ధి లభిస్తుంది. కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయం అందుతుంది. గొప్పవారితో సమయం గడుపుతారు. ఇష్టదైవ స్తుతి శుభఫలాలను ఇస్తుంది.

వృషభం
మనోధైర్యంతో లక్ష్యాలను సాధిస్తారు. ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టదైవ శ్లోకాలు పఠించడం మంచిది.

మిథునం
మానసిక దృఢత్వం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. శ్రీ ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం
ప్రారంభించిన పనులలో అడ్డంకులు ఎదురవుతాయి. సహచరుల సహాయంతో పురోగతి సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

సింహం
ఉద్యోగం, వ్యాపారంలో పురోగతికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు. బుద్ధిబలంతో కీలక సందర్భాలలో పెద్దల, అధికారుల ప్రశంసలు పొందుతారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభం.

కన్య
ప్రయత్నాలు సఫలమవుతాయి. బుద్ధిబలంతో కార్యాలు పూర్తి చేస్తారు. మానసిక దృఢత్వం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలులో పురోగతి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇష్టదైవ ఆరాధన శ్రేయస్కరం.

తుల
అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు రావచ్చు. నిరాశకు లోనవద్దు. ఈశ్వర నామ జపం మంచిది.

వృశ్చికం
గ్రహబలం అనుకూలంగా లేదు. సహచరుల సలహాలు ఉపయోగపడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సర్దుకుంటాయి. దుర్గాదేవి ఆరాధన శుభఫలాలను ఇస్తుంది.

ధనుస్సు
మానసిక దృఢత్వం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధువుల ప్రీతి లభిస్తుంది. అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

మకరం
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తీరి స్థిరత్వం వస్తుంది. భోజన సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠించడం మంచిది.

కుంభం
అనుకూల సమయం. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. లింగాష్టకం పఠనం శుభం.

మీనం
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర కలహాలు రావచ్చు. పనులలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శని జపం అనుకూలం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ