Today Rasi Phalalu:ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్త..
ఈ రోజు (21.06.2025, శనివారం) రాశి ఫలాలు… మేషం నుండి మీనం వరకు 12 రాశుల దిన ఫలాలను ఇక్కడ తెలుసుకోండి. కొంత మంది జాతకాలను నమ్ముతారు. మరి కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.
మేష రాశి
మేష రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి కరువవుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అంతగా కలసిరావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు ముఖ్య విషయాల్లో సహాయపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. కుటుంబం సంతోషకరమైన వాతావరణంలో ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారు తమ ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంట్లో వివాహ ప్రస్తావనలు వస్తాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. కొత్త వస్తువులు, వాహనాలు సొంతమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సోదరులతో స్థిరాస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఊహించని ప్రయాణాలు వాయిదా పడతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం పెరిగి విశ్రాంతి తగ్గుతుంది. పిల్లల చదువు, ఉద్యోగ విషయాల్లో నిరుత్సాహం కలుగుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో వాగ్వాదాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు, మరింత కృషి చేయాలి. కుటుంబ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పిల్లల చదువు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. కొన్ని పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ, నిదానంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవలో పాల్గొని, కొంత ఖర్చు చేస్తారు.
తుల రాశి
తుల రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన సమస్యలు తలెత్తవచ్చు. పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు అవకాశాలను జారవిడుచుకోకుండా చూసుకోవాలి, భవిష్యత్తులో లాభాలు సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు రావచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త వాహనం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఇంటా బయట ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహకరంగా ఉంటుంది. దూర ప్రయాణాల వల్ల ఖర్చు, శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి
మకర రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సంపాదించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు రాజీతో పరిష్కారమవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు.
కుంభ రాశి
కుంభ రాశి వారు అనుకున్న పనులను వేగంగా పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో దీర్ఘకాల సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట మీ పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి నేడు అంతగా అనుకూలం కాకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. దీర్ఘకాల అప్పుల ఒత్తిడి పెరుగుతుంది, దీనివల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

