DevotionalToday Rasi Phalalu In telugu

weekly horoscope:ఈ వారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికీ బాగుంటుందో..

weekly horoscope:ఈ వారం రాశి ఫలాలు (22.06.2025 నుంచి 28.06.2025 వరకు) జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అందించిన వివరాలు.. చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్.

ఆయనము: ఉత్తరాయనం
సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: జ్యేష్ఠ
తిథి: కృష్ణ ద్వాదశి నుంచి శుక్ల తదియ వరకు

మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుట్టబడుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, భూమి కొనుగోళ్లు జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
రంగులు: పసుపు, లేత ఎరుపు
పరిహారం: ఆదిత్య హృదయం పఠించండి.

వృషభ రాశి
వృషభ రాశి వారు చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దీర్ఘకాల సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూ వివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఒత్తిడులు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహకరమైన వారం. వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు.
రంగులు: గులాబీ, ఆకుపచ్చ
పరిహారం: విష్ణుసహస్రనామం పఠించండి.

మిథున రాశి
మిథున రాశి వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన, గృహ కొనుగోళ్లు జరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపార అవకాశాలు అందుతాయి. ఉద్యోగులు, కళాకారులకు సన్మానాలు లభిస్తాయి. వారం మధ్యలో ఖర్చులు, ఒత్తిడులు ఎదురవవచ్చు.
రంగులు: గులాబీ, ఆకుపచ్చ
పరిహారం: ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు, ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం, కుటుంబ ఒత్తిడులు రావచ్చు.
రంగులు: ఎరుపు, నేరేడు
పరిహారం: దేవీ స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి
సింహ రాశి వారికి కొంత శ్రమతో కూడిన వారం. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వివాదాలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహకరమైన వారం. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు.
రంగులు: గులాబీ, లేత ఆకుపచ్చ
పరిహారం: దుర్గాదేవిని పూజించండి.

కన్య రాశి
కన్య రాశి వారి పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. బంధువులు, మిత్రులతో ఏకాభిప్రాయం కుదురుతుంది. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు. వారం ప్రారంభంలో వివాదాలు, అనారోగ్యం.
రంగులు: పసుపు, తెలుపు
పరిహారం: శివ స్తోత్రాలు పఠించండి.

తుల రాశి
తుల రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఉత్సాహం. ముఖ్యమైన సమాచారం అందుతుంది. భూమి, వాహన కొనుగోళ్లు జరుగుతాయి. ఆలయ సందర్శనలు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. వారం ప్రారంభంలో ఖర్చులు, మిత్రులతో విభేదాలు.
రంగులు: గులాబీ, లేత పసుపు
పరిహారం: కనకధారాస్తోత్రం పఠించండి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులకు శుభవార్తలు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో వివాదాలు, అనారోగ్యం.
రంగులు: నీలం, నేరేడు
పరిహారం: శివ పంచాక్షరి పఠించండి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు ఎదురవవచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశ. చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు స్వల్ప లాభాలతో సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు, ధనలాభం.
రంగులు: నీలం, లేత ఆకుపచ్చ
పరిహారం: విష్ణు ధ్యానం చేయండి.

మకర రాశి
మకర రాశి వారికి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలం. వ్యాపార లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయ వర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ఖర్చులు, ఒత్తిడులు.
రంగులు: గులాబీ, నేరేడు
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. నూతన ఉద్యోగ అవకాశాలు. వ్యాపార లాభాలు, ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఖర్చులు.
రంగులు: గులాబీ, తెలుపు
పరిహారం: గణేశ్ స్తోత్రాలు పఠించండి.

మీన రాశి
మీన రాశి వారు ముఖ్యమైన పనులను సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు అవార్డులు. వారం చివరిలో ధన వ్యయం.
రంగులు: నలుపు, ఆకుపచ్చ
పరిహారం: రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ