Skin Brighting Mask: ఒక్క రాత్రిలో మీ ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Skin Brighting Mask: ఒక్క రాత్రిలో మీ ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. అందరూ తమ ముఖం తెల్లగా, కాంతివంతంగా, మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఏదైనా వేడుక, పెళ్లి వంటి సందర్భాలు ఉంటే, వారం రోజుల ముందు నుంచే ముఖాన్ని తెల్లగా, బ్రైట్‌గా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
కొందరు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి, వేల రూపాయలు ఖర్చు చేసి ఫేసియల్స్ చేయించుకుంటారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే సహజసిద్ధమైన చిట్కాలతో ఫేసియల్ అవసరం లేకుండానే, కేవలం ఒక్క రాత్రిలో మీ ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనె, పసుపు, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ముల్తానీ మిట్టి, కొద్దిగా పచ్చిపాలు లేదా రోజ్ వాటర్ కలిపి మెత్తటి పేస్టులా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఈ ప్యాక్‌తో డార్క్ సర్కిల్స్ తగ్గి, చర్మం కాంతివంతంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
2. పసుపు, కాఫీ పొడి, పెరుగు, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా ఒక పాన్‌లో 1 టీ స్పూన్ పసుపును వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, పెరుగు, 1 టీ స్పూన్ తేనె కలిపి సమంగా మిశ్రం చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. రెగ్యులర్‌గా ఈ ప్యాక్ వాడితే నల్ల మచ్చలు, ట్యాన్ తొలగిపోయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
3. అలోవెరా జెల్, తేనె, రోజ్ వాట, ర్,గ్లిజరీన్ ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 1 చెంచా అలోవెరా జల్, 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ గ్లిజరీన్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ చర్మాన్ని తాజాగా ఉంచడమే కాక, నలుపును తగ్గించి తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
4. శెనగపిండి, పటికపొడి, పాలు, తేనె, గ్లిజరిన్ ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 1 టీ స్పూన్ శెనగపిండి, 1 టీ స్పూన్ పటిక పొడి, సమపాళ్లలో పాలు, తేనె, గ్లిజరిన్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వాడితే మొటిమలు, మచ్చలు తగ్గి, చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
ఈ సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లతో మీ చర్మాన్ని ఒక్క రాత్రిలోనే కాంతివంతంగా, తెల్లగా మార్చుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQSkin Brighting Mask: ఒక్క రాత్రిలో మీ ముఖం తెల్లగా

