LIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, ఎంపిక విధానం
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్) దేశవ్యాప్తంగా తమ బ్రాంచ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్ 28, 2025తో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు గడువు ముగిసేలోపు అప్లై చేయాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 24 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
– అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025, జూన్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
– వయోపరిమితి: 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
– జనరల్/ఓబీసీ: రూ. 944
– ఎస్సీ/ఎస్టీ: రూ. 708
– పీడబ్ల్యూబీడీ: రూ. 472
ఎంపిక విధానం:
– రాత పరీక్ష (జూలై 3, 2025న నిర్వహిస్తారు)
– డాక్యుమెంట్ వెరిఫికేషన్
– ఇంటర్వ్యూ
ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో నెలకు రూ. 12,000 స్టైపెండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

