Nova 5G and Pulse 5G:రెండు కొత్త ఫోన్లు లాంచ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Nova 5G and Pulse 5G:రెండు కొత్త ఫోన్లు లాంచ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా.. Ai ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లను Nova 5G మరియు Pulse 5G పేర్లతో లాంచ్ చేస్తోంది.
కంపెనీ ఈ ఫోన్‌ల ఫీచర్లు మరియు మోడల్ వివరాలను వెల్లడిస్తూ టీజర్ ఇమేజ్‌లతో ప్రచారం ప్రారంభించింది. నిజానికి, చాలా రోజుల నుంచి ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ కోసం టీజింగ్ చేస్తోంది, కానీ ఇప్పుడే ఫోన్‌ల పేర్లు మరియు వివరాలను అధికారికంగా వెల్లడించింది.
Nova 5G మరియు Pulse 5G: లాంచ్
Ai ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఈ రాబోయే ఫోన్‌ల లాంచ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఫోన్‌లను జులై నెలలో ఇండియాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
Nova 5G మరియు Pulse 5G: ఫీచర్స్
ఈ రెండు ఫోన్‌లు ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లలో ఇండియాలో అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. రెండు ఫోన్‌లు వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి, ఇందులో 50MP ప్రధాన సెన్సార్ ఉంటుంది. అయితే, ఈ రెండు ఫోన్‌ల ప్రధాన కెమెరా సెన్సార్‌లలో కొన్ని తేడాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
డిజైన్ విషయానికొస్తే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు డిజైన్ పరంగా విభిన్నంగా, అదే సమయంలో స్టైల్‌లో యూనిక్‌గా కనిపిస్తాయి. ఈ ఫోన్‌లు ఎఐ స్మార్ట్‌ఫోన్ యొక్క నెక్స్ట్ క్వాంటమ్ OS (NxtOS)తో పనిచేస్తాయి. ఇది భారత్‌లో తయారైన ఆపరేటింగ్ సిస్టమ్, మరియు ఈ ఫోన్‌ల డేటా ఇండియాలోనే స్టోర్ చేయబడుతుందని కంపెనీ గర్వంగా చెబుతోంది.
రెండు ఫోన్‌లు సన్నని, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్నాయి. లాంచ్ తర్వాత ఈ ఫోన్‌లను పరీక్షించిన తర్వాత మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లను ఏ ఫీచర్లతో లాంచ్ చేస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

