Business

Hdfc Childrens Fund: HDFC సూపర్ స్కీమ్.. 5 లక్షలకు రూ.13 లక్షలు.. 5 ఏళ్లలో డబుల్.. ముఖ్యంగా పిల్లలకు..

Hdfc Childrens Fund: HDFC సూపర్ స్కీమ్.. 5 లక్షలకు రూ.13 లక్షలు.. 5 ఏళ్లలో డబుల్.. ముఖ్యంగా పిల్లలకు..భవిష్యత్తు కోసం పొదుపు, పెట్టుబడులు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్, పిల్లల విద్య వంటి ఆర్థిక లక్ష్యాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది.

ఈ లక్ష్యాలకు తగిన రాబడులు అందించే పథకాలను ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఇందుకు సరైన మార్గంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అనేక మ్యూచువల్ ఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫండ్స్ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును సమకూర్చేలా చేస్తాయి. మీ పిల్లల విద్య, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే చిల్డ్రన్స్ ఫండ్స్ ఒక మంచి ఎంపిక.

ప్రస్తుతం నెట్ అసెట్ వాల్యూ రూ.23 వేల కోట్లు, అంతకు మించిన 12 చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రమే అధిక రాబడులు అందించాయి. గత 5 సంవత్సరాల్లో 20 శాతానికి మించి రాబడులు ఇచ్చిన టాప్ 5 ఫండ్స్ ఉన్నాయి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన చిల్డ్రన్స్ ఫండ్ ఒకటి. ఈ పథకం గత ఐదేళ్లలో అద్భుతమైన రాబడులు అందించి, పెట్టుబడిని రెట్టింపు చేసింది. ఉదాహరణకు, రూ.5 లక్షలు పెట్టిన వారికి రూ.10 లక్షలకు పైగా రాబడి వచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ ఫండ్ వార్షిక చక్రవడ్డీ రేటు (CAGR) 21.45 శాతంగా ఉంది. అంటే, ఏటా 21.45 శాతం రాబడులు అందించింది. లంప్‌సమ్ పెట్టుబడిపై ఈ రాబడులు వచ్చాయి. ఉదాహరణకు, 5 సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు అది రూ.2.50 లక్షల వరకు పెరిగి ఉంటుంది. అదే రూ.5 లక్షలు పెట్టి ఉంటే, ఆ మొత్తం రూ.13 లక్షలకు పైగా అవుతుంది. అంటే, 5 ఏళ్లలో మీ పెట్టుబడిపై రూ.8.29 లక్షల వరకు వడ్డీ వస్తుంది. ఇక్కడ చక్రవడ్డీ ప్రభావం అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే వడ్డీపై వడ్డీ జనరేట్ అవుతుంది.

అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులు చాలా ఫండ్స్‌ను ప్రభావితం చేస్తాయి. పెట్టుబడి పెట్టాలనుకునే వారు ముందుగా ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులో కూడా వస్తాయని హామీ లేదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ