Rasi Phalalu:నేటి రాశి ఫలాలు జూన్ 24, 2025: ఈరోజు ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త..
Rasi Phalalu:నేటి రాశి ఫలాలు జూన్ 24, 2025: ఈరోజు ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త.. కొంత మంది జాతకాలను నమ్ముతారు. మరి కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.
మేషం
మిశ్రమ పరిస్థితులు నెలకొంటాయి. మానసిక ఆందోళన ఇబ్బంది కలిగించవచ్చు. బుద్ధి చాతుర్యంతో సమస్యలను అధిగమిస్తే విజయం సొంతమవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుర్గాదేవి ధ్యానం శుభఫలితాలనిస్తుంది.
వృషభం
ప్రారంభించిన కార్యాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఆర్థిక పురోగతి కోసం చేసిన ప్రయత్నాలు సఫలమవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. దుర్గా శ్లోక పఠనం శుభప్రదం.
మిథునం
నిజాయితీతో కృషి చేస్తే విజయం మీ సొంతమవుతుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మానసిక స్థిరత్వం కోసం జాగ్రత్త వహించాలి. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. శివారాధన రక్షణ కల్పిస్తుంది.
కర్కాటకం
గ్రహబలం కొంత తక్కువగా ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనాపూర్వకంగా వ్యవహరించాలి. బంధుమిత్రుల సహాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ శ్లోక పఠనం శ్రేయస్సునిస్తుంది.
సింహం
శుభకాలం కొనసాగుతోంది. దీనిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం, వ్యాపార రంగాలలో శుభవార్తలు అందుతాయి. సమయపాలనతో పనులను సఫలీకృతం చేస్తారు. పరిస్థితులు అన్నివిధాలా సహకరిస్తాయి. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.
కన్య
స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కారమార్గాలు కనుగొంటారు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తినా, అవి త్వరగా పరిష్కారమవుతాయి. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. చంద్ర ఆరాధన శుభకరం.
తుల
భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. జీర్ణ సమస్యలు రాకుండా సమయానికి ఆహారం, నిద్ర పాటించాలి. చంద్ర ధ్యానం శుభఫలితాలనిస్తుంది.
వృశ్చికం
కాలం మిశ్రమ ఫలితాలనిస్తుంది. బలమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధైర్యంగా చేపట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర దర్శనం శుభప్రదం.
ధనుస్సు
శుభసమయం కొనసాగుతోంది. మీ కృషి విజయవంతమవుతుంది. ముఖ్యమైన విషయంలో అధికారులను సంప్రదిస్తారు. సమయోచిత నిర్ణయాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో ముందస్తు ఆలోచనలు అవసరం. విష్ణు ఆరాధన అనుకూల ఫలితాలతో పాటు శ్రేయస్సునిస్తుంది.
మకరం
ఉద్యోగంలో శుభఫలితాలు అందుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కీలక విషయాలలో పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెంచుకోండి. శివాష్టోత్తర పఠనం శుభప్రదం.
కుంభం
ప్రారంభించిన కార్యాలలో అలసట లేకుండా జాగ్రత్త వహించాలి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ఆర్థికంగా పెట్టుబడులు పెరుగుతాయి. విష్ణు ఆరాధన ఫలప్రదం.
మీనం
ప్రారంభించిన పనులలో ఇతరుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగం కనిపిస్తుంది. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. శ్రీరామ నామస్మరణతో మీ అభివృద్ధి మరింత ఉధృతమవుతుంది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

