Real Estate Tips:మీరు ఏదైనా ఆస్తి లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఐదు ముఖ్యమైన డాక్యుమెంట్లను తప్పక చెక్ చేయండి.
Real Estate Tips: మీరు ఏదైనా ఆస్తి లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఐదు ముఖ్యమైన డాక్యుమెంట్లను తప్పక చెక్ చేయండి. ఈ ఐదింటిలో ఒక్కటి కూడా సరిగా లేకపోతే, ఆ భూమి లేదా ఇంటిని కొనడం మానుకోండి. ఆ ఐదు డాక్యుమెంట్లు ఏమిటో తెలుసుకుందాం:
1. సేల్ డీడ్
ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు తప్పక చూడాల్సిన డాక్యుమెంట్ సేల్ డీడ్. ఈ డాక్యుమెంట్లో ఆస్తి చట్టబద్ధంగా కొనుగోలు చేయబడిందా, భూమి వివరాలు, సరిహద్దులు వంటి అన్ని విషయాలు ఉంటాయి. ఈ సేల్ డీడ్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది.
2. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ)
ప్రాపర్టీ లేదా ఇంటిపై ఏవైనా రుణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యం. సేల్ డీడ్ తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల వివరాలు ఈసీలో కనిపిస్తాయి. ఈ డాక్యుమెంట్‌ను ఆన్లైన్లో లేదా అమ్మకందారుని అడిగి పొందవచ్చు. ఇది ఆస్తి గత 30 ఏళ్ల చరిత్రను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
3. లింక్ డాక్యుమెంట్స్
ప్రతి సేల్ డీడ్‌కు లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్ల ద్వారా భూమి ఎవరి నుంచి, ఎప్పుడు కొనుగోలు చేశారో తెలుస్తుంది. ఇవి ఆస్తి నిజమైనదా, లేక మోసపూరితమైనదా అని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి.
4. రెరా రిజిస్ట్రేషన్
2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం (రెరా) ప్రకారం, 500 చదరపు మీటర్లకు మించిన లేదా 8 కంటే ఎక్కువ యూనిట్లున్న ప్రాజెక్టులు తప్పనిసరిగా రెరాలో రిజిస్టర్ అవ్వాలి. డెవలపర్లు ప్రాజెక్ట్ వివరాలు, లేఅవుట్, ప్రభుత్వ అనుమతులు, పూర్తయ్యే సమయం వంటివి రెరా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇది కొనుగోలుదారులకు సమాచారం అందించి, నమ్మకంగా కొనుగోలు చేయడానికి సహాయపడుతుంది.
5. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్
ఈ పథకం అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను చట్టబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. కొంత మొత్తం చెల్లించి నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. కాబట్టి, మీరు కొనే ఆస్తి లేదా ఇల్లు చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ స్కారమైన బిల్డింగ్ రెగ్యులేషన్ వివరాలను తనిఖీ చేయండి.
ఈ ఐదు డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి, సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఆస్తి కొనుగోలు చేయండి!
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

