Srisailam Free Sparsha Darshan: భక్తులకు గుడ్ న్యూస్… జూలై 1 నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం… పూర్తీ వివరాలు..
Srisailam Free Sparsha Darshan: భక్తులకు గుడ్ న్యూస్… జూలై 1 నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం… పూర్తి వివరాలు.. శైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది.
శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. జూలై 1 నుంచి ఈ ఉచిత స్పర్శ దర్శనం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన సమయ వివరాలను కూడా వెల్లడించారు. వారంలో నాలుగు రోజులు—మంగళవారం నుంచి శుక్రవారం వరకు—ప్రతిరోజూ మధ్యాహ్నం 1:45 నుంచి 3:00 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ ఉచిత స్పర్శ దర్శనంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం కంప్యూటరీకృత టోకెన్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ఈవో వివరించారు. దేవస్థానం వద్ద టోకెన్‌లు జారీ చేస్తారు, ఈ టోకెన్‌లో భక్తుడి పేరు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఉంటాయని చెప్పారు. ఈ వివరాలను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద స్కాన్ చేస్తారని, ప్రతిరోజూ సుమారు 1,000 నుంచి 1,200 మంది భక్తులకు టోకెన్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అయితే, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ ఉచిత స్పర్శ దర్శనం ఉండదని స్పష్టం చేశారు. ఈ సమయంలో రూ. 150, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను నిలిపివేస్తారని, కేవలం ఉచిత దర్శన క్యూలో ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు. స్పర్శ దర్శనం కోసం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరని, పురుషులు తెల్ల పంచ, కండువా, మహిళలు చీర లేదా చున్నీతో సల్వార్ కమీజ్ ధరించాలని సూచించారు.
ప్రత్యేక సందర్భాలైన మహాశివరాత్రి, ఉగాది, దసరా, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో లేదా అసాధారణ రద్దీ ఉన్న సమయాల్లో ఈ దర్శనం అందుబాటులో ఉండదని తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద టోకెన్‌లు జారీ చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఆన్‌లైన్ నమోదు విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

