White Hair: వంటింటి చిట్కాలతో మీ తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. కలర్స్ అవసరం లేదు..
White Hair: వంటింటి చిట్కాలతో మీ తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.. కలర్స్ అవసరం లేదు.. నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజం. అయితే, ఈ తరంలో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకల సమస్య తలెత్తుతోంది. జన్యుశాస్త్రం మాత్రమే కాకుండా, ఆహారంలో ప్రొటీన్, కాపర్ లోపం, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాలు దీనికి దోహదం చేస్తాయి.
తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి మన వంటింట్లోనే అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. రసాయనాలు లేకుండా సహజ పద్ధతులతో చేసే ఈ చికిత్సలు జుట్టును నల్లగా మార్చడమే కాక, జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన హెయిర్ కలరింగ్ లేదా రసాయన ఉత్పత్తులు వాడటం కంటే సహజ పద్ధతులే ఉత్తమం. ఇప్పుడు కొన్ని సహజ చిట్కాలను తెలుసుకుందాం:
1. ఉల్లిపాయలతో
కావలసినవి:
– ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు
– నీళ్లు – తగినంత
తయారీ విధానం:
1. ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, 20 నిమిషాల పాటు నీళ్లలో ఉడికించండి.
2. ఉడికిన నీటిని చల్లార్చి, వడకట్టి జుట్టు మరియు కుదుళ్లకు పట్టించండి.
3. అరగంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.
4. వారానికి రెండుసార్లు ఈ విధానాన్ని పాటిస్తే, తెల్ల జుట్టు సమస్య తగ్గడమే కాక, ఉల్లిపాయల్లోని సల్ఫర్ రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
2. గోరింటాకుతో
కావలసినవి:
– మెత్తగా రుబ్బిన గోరింటాకు – 10 గ్రాములు
– కాఫీ పొడి – 3 గ్రాములు
– పెరుగు – 25 గ్రాములు
– నిమ్మరసం – 4 టీ స్పూన్లు
– బ్రహ్మీ పొడి – 10 గ్రాములు
– ఉసిరి పొడి – 10 గ్రాములు
తయారీ విధానం:
1. ఒక గిన్నెలో గోరింటాకు, కాఫీ పొడి, పెరుగు, నిమ్మరసం, బ్రహ్మీ పొడి, ఉసిరి పొడిని కలిపి మిశ్రమం తయారు చేయండి.
2. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు కుదుళ్లకు పట్టించి, అరగంట పాటు ఉంచండి.
3. చల్లని నీటితో కడిగి, మరుసటి రోజు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.
4. వారానికి ఒకసారి, మూడు నెలల పాటు ఈ విధానాన్ని అనుసరిస్తే తెల్ల జుట్టు నల్లబడుతుంది.
3. కరివేపాకుతో
కావలసినవి:
– కరివేపాకు పేస్ట్ – అర కప్పు
– పెరుగు – 1 కప్పు
– ఆల్మండ్ ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
– గోరువెచ్చని నీళ్లు – తగినంత
తయారీ విధానం:
1. కరివేపాకును కడిగి, పేస్ట్‌గా చేయండి.
2. దీనిలో పెరుగు, ఆల్మండ్ ఆయిల్ కలిపి, జుట్టుకు ప్యాక్‌గా రాయండి.
3. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
4. వారానికి 2-3 సార్లు ఈ ప్యాక్ వాడటం వల్ల తెల్ల జుట్టు తగ్గి, జుట్టు నిగారింపు పెరుగుతుంది.
4. ఆలుగడ్డ రసంతో
కావలసినవి:
– ఆలుగడ్డ రసం – 3 టీ స్పూన్లు
– గుడ్డు తెల్లసొన – 2 టేబుల్ స్పూన్లు
– పెరుగు – 1 టీ స్పూన్
తయారీ విధానం:
1. ఆలుగడ్డను తురిమి, గుడ్డలో పిండి రసం తీయండి.
2. ఒక గిన్నెలో ఆలుగడ్డ రసం, గుడ్డు తెల్లసొన, పెరుగు కలిపి మిశ్రమం తయారు చేయండి.
3. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు రాసి, 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.
4. వారానికి 3 సార్లు, 3 నెలల పాటు ఈ విధానాన్ని పాటిస్తే జుట్టు నిగనిగలాడుతుంది.
5. ఆలుగడ్డ తొక్కతో
కావలసినవి:
– ఆలుగడ్డ తొక్క – 1 కప్పు
– నీళ్లు – 2 కప్పులు
– రోజ్ వాటర్ – 3-4 చుక్కలు
తయారీ విధానం:
1. ఆలుగడ్డ తొక్కను కడిగి, 2 కప్పుల నీటిలో మరిగించండి.
2. మిశ్రమాన్ని చల్లార్చి, వడకట్టి, రోజ్ వాటర్ లేదా లావెండర్ ఆయిల్ కలపండి.
3. ఈ నీటిని జుట్టు కుదుళ్లకు మసాజ్ చేస్తూ రాయండి.
4. ఆరిన తర్వాత కడగకుండా ఉంచండి. వారం రోజులు ఈ విధానాన్ని పాటిస్తే తెల్ల జుట్టు నల్లబడుతుంది.
6. గుడ్డు తెల్లసొనతో
కావలసినవి:
– గుడ్డు తెల్లసొన – 2 కప్పులు
– ఉసిరి కాయలు – 1 కప్పు
– నీళ్లు – 4 కప్పులు
– పంచదార – చిటికెడు
– హెన్నా – 2 కప్పులు
– నిమ్మరసం – 1 టీ స్పూన్
తయారీ విధానం:
1. ఉసిరి కాయలను నీటిలో పంచదారతో కలిపి మరిగించండి. నీరు ఒక కప్పుకు తగ్గే వరకు ఉడకనివ్వండి.
2. చల్లార్చి, వడకట్టి, హెన్నా, గుడ్డు తెల్లసొన, నిమ్మరసం కలపండి.
3. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి, 2 గంటల తర్వాత కడిగేయండి.
4. వారానికి ఒకసారి ఈ విధానాన్ని పాటిస్తే జుట్టు నల్లగా, ఆరోగ్యంగా మారుతుంది.
7. వాల్‌నట్స్‌తో
కావలసినవి:
– వాల్‌నట్స్ – 3 టేబుల్ స్పూన్లు
– కాటన్ బాల్స్ – కావలసినన్ని
తయారీ విధానం:
1. వాల్‌నట్స్‌ను అరగంట పాటు నీటిలో మరిగించండి.
2. చల్లారిన తర్వాత, కాటన్ బాల్స్‌తో జుట్టు కుదుళ్లకు రాయండి.
3. అరగంట తర్వాత తలస్నానం చేయండి. వారానికి 2 సార్లు, 3 నెలల పాటు ఈ విధానం పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
4. రాసేటప్పుడు చర్మం మీద పడకుండా జాగ్రత్త వహించండి.
ఇతర చిట్కాలు:
– ఉసిరి పొడి: 1 కప్పు ఎండబెట్టిన ఉసిరి పొడిని, 2 కప్పుల పెరుగుతో ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం జుట్టుకు రాసి, వారానికి ఒకసారి చేయండి.
– కొబ్బరి నూనె & కర్పూరం: కొబ్బరి నూనెలో కర్పూరం పొడి కలిపి, రాత్రి పడుకునే ముందు తలకు రాసి 5 నిమిషాలు మసాజ్ చేయండి.
– కొబ్బరి నూనె & నిమ్మరసం: కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రోజూ రాస్తే చుండ్రు తగ్గడమే కాక, జుట్టు నల్లబడుతుంది.
– మల్లె తీగ వేళ్లు:మల్లె తీగ వేళ్లను నిమ్మరసంతో గ్రైండ్ చేసి, జుట్టుకు రాసి అరగంట తర్వాత కడిగేయండి.
ఈ సహజ పద్ధతులతో రసాయనాల వాడకం లేకుండా తెల్ల జుట్టు సమస్యను అధిగమించవచ్చు, జుట్టు ఆరోగ్యంగా, నిగనిగలాడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

