DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope in Telugu:ఈ రాశి వారికీ ఆర్ధికంగా బాగుంటుంది.. మీ రాశి ఉందా..?

Rasi Phalalu:ఈ మధ్య కాలంలో రాశి ఫలాలను చూసుకోవటం ఎక్కువ అయింది. ఈ రోజు ఏ రాశి వారికీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేషం
ప్రారంభించిన పనులలో అడ్డంకులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరు ప్రశంసలు పొందుతాయి. ముఖ్యమైన విషయాల్లో మీ బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. దుర్గా స్తోత్రం చదవడం శుభప్రదం.

వృషభం
శుభవార్త వింటారు. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధుమిత్రుల సహాయంతో మేలు జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

మిథునం
ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో ఆర్థిక లాభం ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. శివారాధన శుభం కలిగిస్తుంది.

కర్కాటకం
గ్రహబలం తక్కువగా ఉంది. కొత్త పనుల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది. శత్రువులపట్ల జాగ్రత్త అవసరం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

సింహం
వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. కీలక సమయాల్లో సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూల సమయం. ఇష్టదేవత దర్శనం ఉత్తమం.

కన్య
మీ రంగాల్లో అనుకూల ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

తుల
వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.

వృశ్చికం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగించవచ్చు. చంచల బుద్ధితో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు
ప్రారంభించిన పనులలో ఉత్సాహంగా ముందుకు సాగండి. ఆటంకాలను మనోధైర్యంతో అధిగమిస్తారు. స్థిరత్వంతో చేసే కార్యాలు కీర్తిని తెస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదవడం శుభం.

మకరం
దూరదృష్టితో ప్రణాళికలు రూపొందిస్తారు. ముఖ్య విషయాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

కుంభం
మీ రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఆనందకరమైన సమయం గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుస్తుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం
మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో జాగ్రత్తగా మాట్లాడాలి. సహనం కోల్పోకండి, నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శని ధ్యానం శుభప్రదం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ