Business

Annadata Sukhibhava Scheme: అన్నదాత సుఖీభవ.. రైతులకు శుభవార్త… రెండు పథకాలను ఒకేసారి..

Annadata Sukhibhava Scheme: అన్నదాత సుఖీభవ.. రైతులకు శుభవార్త… రెండు పథకాలను ఒకేసారి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు శుభవార్త అందించాయి. రెండు పథకాలను ఒకేసారి అమలు చేయాలని నిర్ణయించాయి. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను ఒకేసారి విడుదల చేయనున్నాయి. ఈ రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.20,000 జమ కానున్నాయి.

కేంద్రం రూ.6,000, రాష్ట్రం రూ.14,000 కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. ఈ రూ.20,000ను మూడు విడతలుగా విడుదల చేయనున్నారు. రైతుల భూములకు సంబంధించి 98% ఈ-కేవైసీ పూర్తయింది, కేవలం 2% మాత్రమే మిగిలి ఉంది. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూముల రైతులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.

పీఎం కిసాన్ నిధులను జులైలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా జులైలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం రూ.5,000, పీఎం కిసాన్ రూ.2,000 కలిపి మొత్తం రూ.7,000 జమ కానున్నాయి.

అన్నదాత సుఖీభవ పథకం ప్రతి రైతుకు తప్పనిసరిగా అందాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం https://annadathasukhibhava.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. ఈ సైట్‌లో రైతులు తమ వివరాలను పరిశీలించవచ్చు. వచ్చే వారంలో ఈ పోర్టల్ పూర్తిగా సిద్ధం కానుంది. లబ్ధిదారులు తమ పేర్లను, నిధుల స్థితిని ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ పథకం వివరాలను మొబైల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌లోని మొబైల్ యాప్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, స్థితిని తెలుసుకోవచ్చు.

ఏపీలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద 47.77 లక్షల రైతులను అర్హులుగా గుర్తించారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ద్వారా 98% ఈ-కేవైసీ పూర్తయింది. మిగిలిన వారికి వారంలోపు ఈ-కేవైసీ పూర్తి కానుంది. సొంత భూమి, అసైన్డ్, ఇనాం భూముల రైతులు అర్హులు.

భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు ఈ పంటలో తమ పేరును నమోదు చేసుకోవాలి. అర్హతల పరిశీలన తర్వాత వారికి గుర్తింపు కార్డులు, అన్నదాత సుఖీభవ నిధులు అందనున్నాయి.

ఏపీ ప్రభుత్వం జులై, అక్టోబర్, జనవరి-ఫిబ్రవరిలో నిధులను విడుదల చేయనుంది. జులైలో రూ.5,000, అక్టోబర్‌లో రూ.5,000, జనవరి-ఫిబ్రవరిలో రూ.4,000 చొప్పున అన్నదాత సుఖీభవ నిధులు, పీఎం కిసాన్ నిధులతో కలిపి విడుదల కానున్నాయి.

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ