Business

AP Thalliki Vandanam Scheme 2025: రెండో జాబితా విడుదల… మీ అకౌంట్ లో పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి..

AP Thalliki Vandanam Scheme 2025: రెండో జాబితా విడుదల… మీ అకౌంట్ లో పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం కింద రెండవ విడత జాబితా విడుదలైంది.

తొలి విడతలో అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కాని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ క్రమంలో జూన్ 26 వరకు అభ్యంతరాలను స్వీకరించి, జూన్ 28 వరకు వాటిని పరిశీలించింది. అనంతరం జూన్ 30న రెండవ విడత అర్హుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు సంపాదించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జూలై 5లోపు నగదు జమ అవుతుంది.

ఎలా చెక్ చేసుకోవాలి?
1. సచివాలయంలో చెక్ చేయడం: మీ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి, డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించండి. రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. అదనంగా, సచివాలయ నోటీస్ బోర్డులో కూడా జాబితా ప్రదర్శితమవుతుంది.
2. ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేయడం:
– అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లండి.
– ‘తల్లికి వందనం’ పథకాన్ని ఎంచుకోండి, సంవత్సరంగా 2025-26ని సెలక్ట్ చేయండి.
– ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా పూరించండి.
– ‘గెట్ ఓటీపీ’పై క్లిక్ చేయండి. లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, ‘సబ్మిట్’ చేయడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.
3. వాట్సాప్ ద్వారా స్టేటస్ చెక్ చేయడం:
– ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009కి ‘Hi’ అని మెసేజ్ చేయండి.
– సేవల జాబితా నుంచి ‘తల్లికి వందనం’ స్టేటస్‌ను ఎంచుకోండి.
– తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ‘నిర్దారించండి’పై క్లిక్ చేయడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.

నగదు జమ వివరాలు:
– రెండవ విడత జాబితాలో పేరు ఉన్నవారి ఖాతాల్లో జూలై 5లోపు ₹13,000/- డిపాజిట్ అవుతాయి.
– మొత్తం ₹15,000/-లో ₹2,000/- పాఠశాల నిర్వహణ కోసం కట్ చేయబడతాయి.

అర్హత ఉన్న లబ్ధిదారులు పై విధానాల ద్వారా తమ స్టేటస్ తప్పక తనిఖీ చేసుకోండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ