Rasi Phalalu Today: జూలై 02, 2025 రాశిఫలాలు .. ఈ రోజు ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్త..
Rasi Phalalu Today: జూలై 02, 2025 రాశిఫలాలు .. ఈ రోజు ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్త.. ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటూ దానికి తగ్గట్టుగా పనులను చేసుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.
మేషం
విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఇష్టదైవ ఆరాధన చేయాలి.
వృషభం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే అడ్డంకులు తొలగుతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఆందోళనలు పెట్టుకోకండి. దైవారాధనను విడిచిపెట్టవద్దు.
మిథునం
ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి కావాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయకండి. సాహసోపేత విజయాలు సాధిస్తారు. శివారాధన శుభప్రదం.
కర్కాటకం
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.
సింహం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. శని శ్లోకం పఠించండి.
కన్య
మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. గణపతి ఆరాధన శుభకరం.
తుల
ముఖ్య వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటను గౌరవించండి. కోపానికి లోనుకాకండి. మనసు చెడు ఆలోచనల వైపు మళ్లకుండా శివాష్టోత్తరం చదవండి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి.
వృశ్చికం
శుభ సమయం. మీ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. అధికారులతో ముఖ్య విషయంపై సంప్రదించి సానుకూల ఫలితం పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు
ప్రారంభించిన పనులలో సహాయం అందుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. శుభవార్త ఆనందం కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోవద్దు. శ్రీరామ నామ జపం మేలు చేస్తుంది.
మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సమయపాలనతో పనులు పూర్తవుతాయి. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.
కుంభం
వ్యాపారంలో తెలివితో మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శ్రీమహావిష్ణు ఆరాధన శుభకరం.
మీనం
కర్మసిద్ధి ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేసి పనులను పూర్తి చేస్తారు. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవాలి. బద్ధకాన్ని అనుమతించవద్దు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

