Stocks To Watch: జూలై 3, 2025, గురువారం నాడు స్టాక్ మార్కెట్లో గమనించదగిన స్టాక్‌లు ఇవే..
Stocks To Watch:జూలై 3, 2025, గురువారం నాడు స్టాక్ మార్కెట్లో గమనించదగిన స్టాక్‌లు ఇవే. ప్రపంచవ్యాప్త అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ, ఈ రోజు కొన్ని స్టాక్‌లు మంచి కదలికలతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఈ స్టాక్‌లపై దృష్టి పెట్టండి.
1. Nestle India: ప్రముఖ ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ మ్యాగీ తయారీ కోసం నెస్లే ఇండియా గుజరాత్‌లోని సనంద్ ఫ్యాక్టరీలో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ రూ. 105 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
2. Voltas: టాటా సమూహానికి చెందిన ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ, తక్కువ జీఎస్టీ చెల్లింపుల కారణంగా రూ. 265 కోట్ల విలువైన షోకాస్ నోటీసు మరియు డిమాండ్ ఆర్డర్‌ను అందుకుంది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ అథారిటీలకు తెలియజేసింది.
3. Indian Bank: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ తన MCLR వడ్డీ రేటును 0.05% తగ్గించింది. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయి.
4. PNB Housing Finance: ఈ సంస్థ షేరుకు రూ. 5 డివిడెండ్‌ను ప్రకటించింది.
5. IndiGo: ఇండిగో సంస్థ ముంబై నుంచి యూరప్‌లోని ఆమ్స్టర్డామ్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
6. Patanjali Foods: ఈ దేశీయ ఎఫ్ఎమ్సీజీ సంస్థకు కస్టమ్స్ అండ్ డ్యూటీ శాఖ రూ. 27 లక్షల జరిమానా విధించింది. రుచి ఫుడ్స్ విలీనం సందర్భంగా ఉద్భవించిన వివాదం దీనికి కారణమని పేర్కొంది.
7. PNB: ఈ బ్యాంక్ మొదటి త్రైమాసిక ఫలితాల్లో దేశీయ రుణాలు 9.7% పెరగగా, గ్లోబల్ రుణాలు 9.9% పెరిగాయి. దేశీయ డిపాజిట్లు 12.2% పెరిగినట్లు తెలిపింది.
8. Avenue Supermarts: డీమార్ట్ మాతృ సంస్థ అయిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం రూ. 13,712 కోట్ల నుంచి రూ. 15,932 కోట్లకు పెరిగింది. గత నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 424 డీమార్ట్ స్టోర్లు ఉన్నాయి.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీలు మరియు ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. మీ పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాల వల్ల జరిగే లాభనష్టాలకు chaipakodi బాధ్యత వహించదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తుంది.

