BusinessToday gold rate

Gold Rate Today: జూలై 3వ తేదీ, గురువారం బంగారం ధరలు ఇవే.. ఈ సమయంలో కొనవచ్చా.. నిపుణులు సలహా..?

Gold Rtae Today:జూలై 3, 2025, గురువారం నాడు బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,260కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,050కి పెరిగింది. అలాగే, వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,09,601కి చేరింది. బంగారం ధరలు మళ్లీ ఆల్-టైమ్ గరిష్ట స్థాయి వైపు దూసుకెళ్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులే అని చెప్పవచ్చు.

తాజాగా విడుదలైన అమెరికా జూన్ నెల ఉద్యోగ డేటా ప్రతికూల ఫలితాలను సూచించింది. ఏడిపి జాబ్ డేటా ప్రకారం, అమెరికా ప్రైవేట్ సెక్టార్‌లో -33,000 ఉద్యోగాలు తగ్గాయి, అంటే కొత్తగా చేరినవారి కంటే 33,000 మందిని తొలగించారు.

2023 తర్వాత ఉద్యోగ డేటా తగ్గడం ఇదే మొదటిసారి. గత రెండేళ్లుగా ఉద్యోగ డేటా నిరంతరం పెరుగుతూ వచ్చింది, కానీ ఈ నెగటివ్ డేటా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందనే సంకేతాలు వెలువడ్డాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే, ఇన్వెస్టర్లు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడం కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమని భావించవచ్చు. దీంతో బంగారం డిమాండ్ పెరిగి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అదే సమయంలో, స్టాక్ మార్కెట్లు కూడా ప్రతికూల ధోరణిని చూపిస్తున్నాయి. ఫలితంగా, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారంలో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది, దీనివల్ల బంగారం డిమాండ్ మరియు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడుతుంది. డాలర్ బలహీనపడితే, ఇతర దేశాలు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపే అవకాశం ఉంది, దీనివల్ల బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 3,350 డాలర్ల వద్ద ఉంది, గతంతో పోలిస్తే దాదాపు 100 డాలర్లు పెరిగింది. ఈ అంశం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమైంది.

పెరుగుతున్న బంగారం ధరలు ఆభరణాల కొనుగోలుదారులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ, బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ