Instant Facial: ఇలా చేస్తే 5 నిమిషాల్లో మెరిసే అందమైన చర్మం మీ సొంతం..
Instant Facial: ఇలా చేస్తే 5 నిమిషాల్లో మెరిసే అందమైన చర్మం మీ సొంతం.. ప్రతి అమ్మాయి తన ముఖం కాంతివంతంగా, ఆరోగ్యంగా మెరిసే చర్మంతో ఉండాలని కోరుకుంటుంది. అయితే, ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది చర్మ సమస్యలతో సతమతమవుతున్నారు.
దీనివల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాక, అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు చాలా మంది బ్యూటీ పార్లర్లకు వెళ్లి, వేల రూపాయలు ఖర్చు చేసి వివిధ రకాల ఫేసియల్స్ చేయిస్తారు.
అయితే, ఇలాంటి చికిత్సల వల్ల ఫలితం ఉంటుందో లేదో గ్యారంటీ లేనప్పటికీ, కొన్నిసార్లు చర్మ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఖరీదైన క్రీములకు బదులుగా, ఇంట్లోనే లభ్యమయ్యే సహజసిద్ధమైన పదార్థాలతో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ పద్ధతులను అనుసరిస్తే మొటిమలు, మచ్చలు తగ్గి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. మరి ఈ సహజ పద్ధతులను ఎలా అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్-1
కీరదోస ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది, ముఖం తాజాగా, మెరిసేలా మారుతుంది.
స్టెప్-2
బాగా పండిన అరటిపండు గుజ్జును తీసుకుని, దానికి ఓట్స్ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
స్టెప్-3
ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ విధానం ముఖాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
స్టెప్-4
కీరదోస రసానికి రైస్ వాటర్ కలిపి ముఖానికి రాయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది ముఖాన్ని మెరిసేలా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

