Free Traininig: 16కోర్సులకు ఫ్రీ ట్రైనింగ్….భోజనం, వసతి ఉచితం..
Free Traininig: జీఎంఆర్ ఫౌండేషన్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ యూనియన్ బ్యాంక్ సహకారంతో విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. 16 రకాల కోర్సులైన కంప్యూటర్ అకౌంటింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, హౌస్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్, ఎల్ఎంవి డ్రైవర్, ఉమెన్స్ టైలరింగ్, వస్త్ర చిత్రకళ, సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాలేషన్, జనరల్ ఈడీపీ, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, టూవీలర్ మెకానిక్, కాస్ట్యూమ్ జ్యువెలరీ మేకింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, మెన్స్ టైలరింగ్, జంకీ బ్యాంగిల్స్, ఫినాయిల్ మేకింగ్ వంటి కోర్సులకు నిపుణుల ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
ఈ కోర్సులలో చేరే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు, శిక్షణ పూర్తయిన తర్వాత అవసరమైన వారికి బ్యాంకు రుణాలు కూడా అందిస్తున్నారు. కోర్సులకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. కనీసం 10వ తరగతి చదివినవారు, కొన్ని కోర్సులకు 7వ లేదా 8వ తరగతి చదివినవారు కూడా చేరవచ్చు. శిక్షణ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష ద్వారా సర్టిఫికేట్ అందజేస్తారు.
విశేషం ఏమిటంటే, జంకీ బ్యాంగిల్స్, ఆర్టిఫిషియల్ బ్యాంగిల్స్, సర్ఫ్ మేకింగ్, ఫినాయిల్ మేకింగ్ వంటి కోర్సులకు ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేకాదు, శిక్షణ కేంద్రానికి రాకపోకల ఖర్చులను సంస్థ భరిస్తుంది. ప్రతి నెలా కొత్త బ్యాచ్‌లు ప్రారంభిస్తున్నారు.
నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరుతోంది. మరిన్ని వివరాల కోసం సంస్థను సంప్రదించాలని సూచించారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

