AP Mega DSc : మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రైమరీ కీ విడుదల..
AP Mega DSc : మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రైమరీ కీ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏపీ డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ముఖ్యమైన అప్డేట్‌ను వెల్లడించారు.
మెగా డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్‌లను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.inలో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, జులై 11, 2025లోగా అదే వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలని ఆయన సూచించారు.
ఈ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 2, 2025 వరకు 23 రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్వహించబడ్డాయని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు ఆయన వెల్లడించారు.

