Devotional

Tirumala srivani darshan:తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదులపై అపోహలు..నిజాలు..

Tirumala srivani darshan:తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదులపై అపోహలు..నిజాలు.. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, వసతి గదుల కేటాయింపులో సమస్యలున్నాయని కొందరు భక్తులు చేసిన ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖండించింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేస్తూ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

గురువారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద కొందరు భక్తులు మీడియాతో మాట్లాడుతూ, శ్రీవాణి టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోందని, సరైన వసతి గదులు కేటాయించలేదని ఆరోపించారు. రూ.500 గది కోసం వెళితే రూ.50 గది ఇచ్చారని, అందులో బొద్దింకలు, పురుగులు ఉన్నాయని, ఈవోకు ఫోన్ చేసినా స్పందన లేదని వాపోయారు. అయితే, ఈ ఆరోపణలను టీటీడీ తోసిపుచ్చింది.

టీటీడీ ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు తిరుమలలో శ్రీవాణి టికెట్ల జారీ సక్రమంగా జరుగుతోంది. భక్తులను కౌంటర్ వద్దకు ఉదయం 7:30 గంటల నుంచి మాత్రమే అనుమతిస్తారు. ఆరోపణలు చేసిన భక్తులు రాత్రి 3:30 గంటలకే వచ్చి నిరీక్షించారని, టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని, అన్నపానీయ సౌకర్యాలు లేవని చెప్పడం సరికాదని టీటీడీ తెలిపింది. శ్రీవాణి టికెట్ కౌంటర్ వద్ద ఉదయం నుంచి టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేస్తున్నామని, దీనికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నామని పేర్కొంది.

గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో శ్రీవాణి టికెట్ల కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని టీటీడీ వివరించింది. ముందుగా వచ్చినవారికి ముందుగా అనే ప్రాతిపదికన పరిమిత సంఖ్యలో శ్రీవాణి టికెట్లను మరుసటి రోజు దర్శనం కోసం కేటాయిస్తున్నామని తెలిపింది.

వసతి గదుల విషయంలో, సాధారణ భక్తులకు తిరుమలలో పెద్ద సంఖ్యలో గదులు కేటాయిస్తున్నామని, శ్రీవాణి టికెట్ తీసుకునే భక్తులు సాధారణంగా తిరుపతిలో వసతి తీసుకుని దర్శనానికి వెళతారని టీటీడీ పేర్కొంది. తిరుమలలో గదులు డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్న గదులను మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేసింది. టీబీసీ గదుల్లో బొద్దింకలు, అపరిశుభ్రత ఉన్నాయన్న ఆరోపణలపై టీటీడీ తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో గదులు పరిశుభ్రంగా ఉన్నాయని, బొద్దింకలు లేదా అపరిశుభ్రత లేదని తేలిందని తెలిపింది.

తిరుమలలో గదులు, మరుగుదొడ్లు, దర్శన క్యూలైన్లు, రోడ్లను 24×7 పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఆరోగ్య విభాగం కృషి చేస్తోందని పేర్కొంది. ఈ వాస్తవాలను విస్మరించి, టీటీడీపై ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. రద్దీ, పరిమిత వసతి గదులను దృష్టిలో ఉంచుకుని భక్తులు సంయమనంతో సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ