Today Horoscope:జూలై 5 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కొంచెం కష్టాలు ఎక్కువ..
TODAY HOROSCOPE IN TELUGU: నేడు జూలై 5, 2025, శనివారం. చాంద్రమానం ఆధారంగా ద్వాదశ రాశుల ఈ రోజు దినఫలాలు ఇలా ఉన్నాయి: మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అలాగే కొంత మంది అసలు జాతకాలను నమ్మరు.
మేషం
ఈ రోజు మీకు అన్ని విధాలా అనుకూలం. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం. వ్యాపారం లేదా కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నవారు ఈ రోజు ఆ దిశగా అడుగులు వేయవచ్చు. ఆరోగ్యం బాగున్నప్పటికీ, ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. విష్ణు సహస్రనామం పఠనం రోజును శుభంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. లక్కీ కలర్: తెలుపు, లక్కీ నెంబర్: 9.
వృషభం
ఉల్లాసకరమైన రోజు. అన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయం సాధించే అవకాశం. శుక్రుడి అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంది. రాజకీయ నాయకులు, కళాకారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి రోజు. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రుచికరమైన భోజనం ఆనందిస్తారు. సంతానం గురించి శుభవార్త వినే అవకాశం. దుర్గాదేవి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నెంబర్: 3.
మిథునం
ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి, ముఖ్యంగా జీవిత భాగస్వామితో. ప్రైవేట్ ఉద్యోగులకు కార్యాలయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. శుభవార్త వినే అవకాశం ఉంది. వేంకటేశ్వర స్వామి దర్శనం లేదా “ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభం. లక్కీ కలర్: పసుపు, లక్కీ నెంబర్: 8.
కర్కాటకం
అన్ని విధాలా అనుకూలమైన రోజు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఊహించని సంఘటన వల్ల అద్భుత ఫలితాలు సాధ్యం. మనసులోని ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవద్దు. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. అమ్మవారికి కుంకుమ పూజ చేయడం శుభం. లక్కీ కలర్: తెలుపు, లక్కీ నెంబర్: 9.
సింహం
మీ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారం లేదా వెంచర్ ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కొంత శ్రమ అధికం కావచ్చు. ఆహారంలో జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, సినిమా రంగాల వారికి మంచి రోజు. గురు బలం వల్ల అనుకూలతలు ఎక్కువ. ఒప్పందాలు, భూమి కొనుగోలు-అమ్మకాలకు అనుకూల సమయం. స్పెక్యులేషన్‌లో పాల్గొనవద్దు. విష్ణు సహస్రనామం పఠనం శుభం. లక్కీ కలర్: పసుపు, లక్కీ నెంబర్: 11.
కన్య
ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. చిన్న విషయాలకు ఆందోళన చెందవద్దు. ఉత్సాహకరమైన సమాచారం అందుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. అప్పులు ఇవ్వకండి. ఉద్యోగులకు ప్రమోషన్‌కు అవకాశం. ఆకస్మిక ధనలాభం సాధ్యం. శివారాధన అదృష్టాన్ని తెస్తుంది. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నెంబర్: 6.
తుల
జీతంలో పెరుగుదల, పెట్టుబడులపై లాభాలు ఆర్జించే సమయం. కుటుంబంలో ప్రేమ, ఆనందం పెరుగుతాయి. విహార యాత్రలకు అనుకూలం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి రోజు. పోటీదారులపై ఆధిపత్యం ఉంటుంది. గణపతి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది. లక్కీ కలర్: ఆకుపచ్చ, లక్కీ నెంబర్: 5.
వృశ్చికం
కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఆర్థికంగా చిన్న ఒడిదుడుకులు ఉండవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశం కనిపిస్తుంది. జూదం లాంటి వాటికి దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్, బంగారం కొనుగోలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం, కానీ జాగ్రత్త అవసరం. శివారాధన అదృష్టాన్ని తెస్తుంది. లక్కీ కలర్: పసుపు, లక్కీ నెంబర్: 11.
ధనుస్సు
విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలను తెలివిగా పరిష్కరించండి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. రియల్ ఎస్టేట్ ఒప్పందాలకు మంచి సమయం. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి. ప్రైవేట్ ఉద్యోగులకు పురోగతి అవకాశం. గణపతి పూజ శుభం. లక్కీ కలర్: పసుపు, లక్కీ నెంబర్: 9.
మకరం
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి, వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్, రాజకీయ నాయకులకు అనుకూలం. గురు బలం వల్ల విజయం సాధ్యం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. వేంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పణ లేదా “ఓం నమో నారాయణాయ” 108 సార్లు జపించడం శుభం. లక్కీ కలర్: పసుపు, లక్కీ నెంబర్: 6.
కుంభం
ఆర్థికంగా లాభదాయకమైన రోజు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశం. భూ క్రయవిక్రయాలకు, బంగారం కొనుగోలుకు అనుకూలం. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. గణపతి గరిక పూజ శుభం. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నెంబర్: 5.
మీనం
అనుకోకుండా ధనలాభం. విద్యార్థులకు మంచి రోజు. ఊహించని ఆర్థిక లాభం కనిపిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీసులో మీ పనిపై దృష్టి పెట్టండి. డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం, పిల్లల చదువు గురించి శ్రద్ధ వహించండి. విష్ణు సహస్రనామం పఠనం శుభం. లక్కీ కలర్: తెలుపు, నీలం, లక్కీ నెంబర్: 7.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

